13 ఏళ్ల మైనర్ బాలిక మీద అత్యాచారం కేసులో బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలికపై అత్యాచారం చేసిన కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి కి హైకోర్టు బెయిల్ ఇచ్చింది. లైంగిక సంబంధం ప్రేమ వ్యవహారం తో జరిగిందని చెప్పారు. కోర్టు అది తప్పు కాదని తన అభిప్రాయాన్ని చెప్పింది. బాలిక మైనర్ అయితే తన ఇష్టంతోనే ఇంటిని వదిలేసి నిందితుడు తో కలిసి వెళ్లిందని పోలీసులకి కూడా చెప్పినట్లు జస్టిస్ ఊర్మిళ జోషి ఫాల్కే చెప్పారు.
26 ఏళ్ల నిందితుడు 13 ఏళ్ల బాలిక మధ్య ప్రేమ వ్యవహారంతోనే వీళ్ళిద్దరూ కలిసి ఉన్నట్లు చెప్పారు. లైంగిక సంబంధం ఆరోపణలో ఇద్దరు మధ్య ఆకర్షణ బయటపడినట్లు కోర్టు వెల్లడించింది. ఆగస్టు 2020లో బాలిక తండ్రి మిస్సింగ్ ఫిర్యాదు దాఖలు చేశారు. 13 ఏళ్ల కూతురు పుస్తకాలు తీసుకొస్తానని ఇంటి నుండి బయటకు వెళ్ళింది ఆమె తిరిగి రాలేదని కంప్లైంట్ లో చెప్పారు ఇష్టపూర్వకంగానే ఇల్లు వదిలి బాలిక వెళ్లిపోయిందని పోలీసులకి చెప్పింది నిందితుడు తనని పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని ఆమె అంది.