కరోనా వైరస్ వ్యాప్తికి తోడు ఓమిక్రాన్ వేరియంట్ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో బూస్టర్ డోసు పై దేశ వ్యాప్తం గా చర్చ జరుగుతుంది. ఇప్పటికే పలు దేశాల్లో ఓమిక్రాన్ వేరియంట్ ను ఎదుర్కొవడానికి బూస్టర్ డోసు పంపిణీ చేస్తున్నారు. మన దేశంలో కూడా ప్రజలకు బూస్టర్ డోసు పంపిణీ చేయాలన్న డిమాండ్ కూడా రోజు రోజు కు పెరిగిపోతుంది. ఇదీల ఉండగా.. భారత్ బయోటెక్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. డీసీజీఐ అనుమతి ఇస్తే.. బూస్టర్ డోసు ను ముక్కు ద్వారా అందిస్తామని ప్రకటించింది.
అంతే కాకుండా ముక్కు ద్వార తీసుకునే ఇంట్రా నాజిల్ టీకాను కూడా భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిందని తెలుస్తుంది. ఎక్కువ సంఖ్య లో బూస్టర్ డోసు పంపిణీ చేయడం లో ఇంట్రా నాజిల్ టీకా ఎంతో ఉపయోగ పడుతుందని తెలిపింది. తమ టీకా కు అనుమతి ఇవ్వాలని భారత ఔషద నియంత్రణ సంస్థ కు ధరఖాస్తు చేసుకుంది. అయితే ముక్కు ద్వారా టీకా ఇస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిపింది. కరోనా వైరస్ ముక్కు ద్వారానే శరీరంలోకి ప్రవేశిస్తుందని తెలిపారు. ఈ టీకా ఇస్తే ముక్కులో రోగనిరోధక ప్రతిస్పందనలు కలుగుతాయని వివరించారు.