ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఫెగాసెస్ స్పైవేర్ వివాదం ముదురుతుంది. అధికార వైసీపీ. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అంతే కాకుండా అసెంబ్లీ స్పీకర్ కూడా ఫెగాసెస్ స్పైవేర్ కొనుగోలు పై విచారణ చేయడానికి ఒక ప్రత్యేక కమిటీని కూడా వేశారు. కాగ ఈ ఫెగాసెస్ స్పైవేర్ అంశంపై అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు స్పందించారు. తాను సర్వీస్ లో ఉన్న సమయంలో టీడీపీ ప్రభుత్వం ఫెగాసెస్ స్పైవేర్ ను కొనుగోలు చేయలేదని అన్నారు.
కాగ ఈ ఫెగాసెస్ అంశంలో తనపై అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నానని తనపై అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాను జీవితాంతం ప్రజలకు రక్షణగా ఉన్నానని అన్నారు. కానీ ఇప్పుడు నాకే రక్షణ లేదని అంసతృప్తి వ్యక్తం చేశారు. తాను ప్రభుత్వాన్ని విమర్శించడం లేదని అన్నారు. కానీ తనపై చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టడానికే మాట్లాడుతున్నాని అన్నారు. తాను నాగాలాండ్ నుంచి రాలేదని.. ఏపీ మట్టిలోనే పుట్టానని అన్నారు. తప్పు చేయాలంటే భయపడే వ్యక్తినని అన్నారు.