ఇదేక్కడి విడ్డూరం రా బాబు.. నదులలో కూడా ఆడ , మగ ఉంటాయా?

-

మనుషులు , పక్షులు, పురుగులు,ఆఖరికి చెట్ల లలో ఆడ ,మగ ఉంటాయి.అందుకే వాటి నుంచి మరో ప్రాని పుట్టుకొస్తుంది. కానీ, కేవలం జీవిరాశులకు, ఇతర మొక్కలక్కు ఆశ్రయము ఇస్తున్న కొండలు, పర్వతాలు, నదుల లో కూడా ఆడ, మగ అనేది ఉంటుందా? అసలు అది సాధ్యమవుతుందా.. ఇలాంటి సందెహాలు అందరికి రావడం కామన్.. అవును అండీ మగ నది కూడా ఉందని అంటున్నారు. అసలు ఆలస్యం చేయకుండా ఆ నది గురించి పూర్తీ విజయాలను ఇప్పుడు తెలుసుకుందాము..

 

బ్రహ్మపుత్ర నది..ఈ నది పేరు అందరికి తెలిసే ఉంటుంది.బ్రహ్మ బిడ్డగా ప్రసిద్ధి చెందిన ఈ నది భారతదేశంలోనే ఏకైక పురుష (మగ) నదిగా పేరుగాంచింది. ఇది చైనాలోని టిబెట్ లో పుడుతుంది.అక్కడ దీన్ని యార్లంగ్ త్సాంగ్పో అని పిలుస్తారు. బ్రహ్మపుత్రను హిందువులు, జైనులు, బౌద్ధులు అత్యంత భక్తిప్రవత్తులతో దేవత నదిగా కొలుస్తారు..పవిత్ర నది కావున.. ఎంతో శ్రద్దగా పూజలు కూడా చేస్తారు.బ్రహ్మ పుత్ర నది మానస సరోవర శ్రేణుల నుంచి ఉద్భవించిన రెండవ నది. చైనాలోని టిబెట్ లో గల మానస సరోవర్ సరస్సు సమీపంలో ఉన్న అంగ్సీ హిమానీ నదం నుంచి పుట్టింది.

భారతదేశంలోని ఏకైక ‘మగ నది’గా పిలుస్తారు. అరుణచల్ ప్రదేశ్ లో భారత్ లోకి ప్రవేశించింది. అనంతరం అస్సాం గుండా ప్రయాణించి బంగ్లాదేశ్ లోకి ప్రవేశిస్తుంది. భారత్ లో దీని మొత్తం పొడువు 916 కిలోమీటర్లు మాత్రమే. బంగ్లాదేశ్ లో బ్రహ్మపుత్ర రెండు పాయలుగా విడిపోతుంది. పెద్ద పాయ దక్షిణ దిశగా ‘జమున’ నది వైపు పయనిస్తుంది.అలాగే గంగ నదిలో కలుస్తుంది. వేరొక పాయ మేఘ్నా నదిలో’ కలుస్తుంది..

బ్రహ్మపుత్ర పేరు చరిత్ర..

హిందువులకు దేవుడైన బ్రహ్మ-అమోఘాల కుమారుడే బ్రహ్మపుత్ర..శంతను మహర్షి కూతురైన అమోఘ అందమైన ఆమెను చూసి మంత్ర ముగ్దుడైన బ్రహ్మ వివాహమాడాడని చరిత్రలో చెబుతారు. అమోఘాతో కాపురం చేయగా.. ఒక అబ్బాయి పుట్టాడు. ఆ బాలుడే నీరులా ప్రవహించాడని, అతనే బ్రహ్మ పుత్ర.. అలా అతని పుట్టుక వచ్చింది.బ్రహ్మపుత్ర ప్రతి సంవత్సరం భారీ వరదలు సృష్టిస్తుంది. ఆ వరద తాకిడికి దాని గమనాన్ని మారుస్తుంది. తద్వారా కొత్త భూభాగాలు దీని తీరంలో ఏర్పడుతుంటాయి.ఈ పరీవాహక ప్రాంతంలోని గొప్ప వర్షారణ్యాలు అనేక రకాల వృక్షజాతులు.. జంతుజాలానికి నిలయంగా ఉన్నాయి. అనేక స్థావరాలు ఉన్నాయి. ఇది కజిరంగా, మానస్, కాంచన్‌గంగా వంటి జాతీయ ఉద్యానవనాలను కలిగి ఉంది. దేశంలోని గంగా, గోదావరి, కృష్ణ, యమున, నర్మదా, కృష్ణా, సింధూ, మహా, కావేరి, తపతి అన్నీ నదులు స్త్రీ నామాలతోనే పెట్టారు.వీటి అన్నిటికన్నా బ్రహ్మ పుత్ర నది ఒకటే ఏకైక మగ నదిగ పేరుగాంచింది.. అది ఈ నది కథ..

Read more RELATED
Recommended to you

Exit mobile version