BREAKING: కానిస్టేబుల్ లకు మెడికల్ టెస్ట్ లు ఆపండి అంటూ కోర్ట్ ఉత్తర్వులు !

-

కేసీఆర్ ప్రభుత్వం లో ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలలో ఏదో ఒక సమస్య లేదా అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ఇంతకు ముందు గ్రూప్ పరీక్షలకు సంబంధించి పేపర్ లీక్ లు అయిన సంగతి తెలిసిందే. తాజాగా కానిస్టేబుల్ నియామక ప్రక్రియపై ఒక సమస్య వచ్చింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం TSLPRB ఆయా జిల్లా ఎస్పీ లు మరియు కమిషనర్ లకు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇటీవల నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షలో ప్రశ్నాపత్రంలోని నాలుగు ప్రశ్నలు తప్పుగా ఇవ్వడంతో నాలుగు మార్కులు కలపాలని హై కోర్ట్ గత కొన్ని రోజుల క్రితం TSLPRBని ఆదేశించింది.. కానీ నియామక ప్రక్రియను మార్కులను కలపకుండా కొనసాగిస్తోంది. అందుకే పిటీషర్లు మరోసారి కోర్ట్ మెట్లెక్కి మాకు అన్యాయం జరుగుతోంది అంటూ పిటిషన్ వేయగా, ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న హై కోర్ట్ వెంటనే నియామక ప్రక్రియలో భాగంగా జరుగుతున్న మెడికల్ టెస్ట్ లను ఆపాలని ఉత్తర్వులను ఇచ్చింది.

తర్వాత కోర్ట్ నుండి ఏమైనా ఆదేశాలు వీచే వరకు మెడికల్ టెస్ట్ లు నిర్వహించకూడదని TSLPRB ని ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version