మారుతున్న రాజకీయ సమీకరణాలు ఏ పార్టీకి అనుకూలంగా మారుతాయన్నది ఊహించలేని పరిస్థితి. కొన్ని రోజుల క్రిందట వైసీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వివిధ కారణాలను చూపుతూ టీడీపీకి పారిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టీడీపీ తరపున మీటింగ్ లలో పాల్గొంటూ నెల్లూరు రురల్ నియోజకవర్గంలో టీడీపీని గెలిపించే లక్ష్యంతో ముందుకు వెళుతున్నాడు ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని నెల్లూరు రురల్ నియోజకవర్గానికి ఇంచార్జి గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనితో వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రురల్ లో వైసీపీకి ప్రత్యర్థి ఎవరు అనే విషయం క్లారిటీ వచ్చేసింది. కాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం నెల్లూరు రురల్ లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఢీ కొట్టే సత్తా ఉంది ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి అని సీఎం జగన్ నమ్మి అతనికే నెల్లూరు రురల్ వైసీపీ నియోజకవర్గ పగ్గాలను అందించారు.