నిన్న సాయంత్రం ఆంధ్రప్రదేశ్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు హఠాత్తుగా గుండె పోటు రావడంతో రాష్ట్ర ప్రజలు అంతా ఆవేదనకు గురయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో వేణుగోపాలకృష్ణ మంత్రిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. విజయవాడ లోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా, ప్రధమ చికిత్స చేసిన అనంతరం అత్యవసర చికిత్స అవసరమని భావించిన వైద్యులు ఆయన్ను మణిపాల్ హాస్పిటల్ కు పంపించారు. నిన్నటి నుండి అక్కడ వైద్యం చేయించుకున్న మంత్రి వేణుగోపాల్ కృష్ణ కాస్త ఆరోగ్యం కుదుటపడడంతో ఈ రోజు కాసేపటి క్రితమే డిశ్చార్జ్ చేయడం జరిగింది. కొన్ని రోజులు పాటుగా ఈయన ఒత్తిడితో కూడిన పనులకు దూరంగా ఉండాలని వైద్యులు తెలిపినట్లు సమాచారం. అయితే ఈ చికిత్సలో భాగంగా మంత్రికి వైద్యులు యాంజియో ప్లాస్ట్ చేసినట్లు నిర్దారించారు.
ఈయన ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం లేదని తెలుసుకున్న కుటుంబ సభ్యులు, తోటి మంత్రులు మరియు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక వచ్చే సంవత్సరం జరగనున్న ఎన్నికలలో చెల్లుబోయిన వైసీపీ తరపున పోటీ చేసి గెలిచి మళ్ళీ మంత్రి అవ్వాలని కోరుకుందాం.