మరో మూడు రోజుల్లో వన్ డే వరల్డ్ కప్ 2023 చివరి యుద్దానికి తెరలేవనుంది. మొత్తం పది జట్లు తలపడిన ఈ మహాసంగ్రామంలో చివరికి రెండు జట్లు అమీ తుమీ తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. మొదటి సెమీస్ లో ఇండియా కివీస్ ను ఓడించి ఫైనల్ కు చేరుకోగా, ఆ తరువాత ఆస్ట్రేలియా కోల్కతా ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో 3 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికా ను ఓడించి సగర్వంగా ఫైనల్ కు వెళ్ళింది. దీనితో ఇండియాను ఆదివారం ఫైనల్ లో ఆస్ట్రేలియా ఢీకొనబోతోంది. ఈ వరల్డ్ కప్ ఫైనల్ కోసం కోట్లాదిమంది అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇండియా ఫైనల్ లో ఉండడం మరియు ఫైనల్ ఇండియాలో జరుగుతుండడమే ప్రధాన కారణాలు అని చెప్పాలి.
ఆదివారం గుజరాత్ లోని అహమ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం లో ఫైనల్ మ్యాచ్ ఇండియా మరియు ఆస్ట్రేలియా ల మధ్యన జరగనుంది. ఈ మ్యాచ్ లో ఇండియా గెలిచి కప్ ను అందుకుంటే మూడు సార్లు టైటిల్ ను గెలిచినట్లు అవుతుంది.