ఏపీలో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించలేం: మంత్రి బుగ్గన

-

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భేటి అయ్యారు. అంతకు ముందు ఇద్దరు సహాయ మంత్రులను కూడా కలిసిన బుగ్గన… రాష్ట్రానికి సంబంధించిన ఓ కాంట్రాక్ట్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌లో ఉందని మంత్రులకు విన్నవించారు. లండన్‌లో మొదటి దఫా ఆర్బిట్రేషన్ జరిగింది… ఇప్పుడు రెండవ దఫా జరగాల్సి ఉందన్నారు.

న్యాయపరమైన అంశాలు కాబట్టి జాప్యం జరుగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ కు వివరించారు బుగ్గన. అనంతరం బుగ్గన మాట్లాడుతూ..రాష్ట్ర వాటాలపై చర్చించేందుకే కేంద్ర మంత్రిని కలిశానని.. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం ఇప్పటికే చెప్పామన్నారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించే ఉద్దేశ్యం లేదన్నారు.  రాష్ట్ర ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా ఆదాయ వనరులు చాలా అవసరమనీ.. కేంద్ర ప్రభుత్వం ఆదాయం, ఖర్చులు పరిస్థితులు వేరన్నారు.

రాష్ట్రానికి చమురు ఉత్పత్తులు, మద్యం ద్వారా మాత్రమే నేరుగా పన్నుల రూపంలో ఆదాయం వస్తుందని.. మిగతావన్నీ జీఎస్టీ పరిధిలో ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయాలు అంత సులభంగా తీసుకోలేమనీ.. అన్ని రాష్ట్రాలదీ ఇదే పరిస్థితి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కేంద్రం నిర్ణయం తీసుకుంది కదా, అని 24 గంటల్లో నిర్ణయాలు తీసుకోలేమనీ.. కేంద్ర ఖర్చులు, రాష్ట్రాల ఖర్చులు వేరని తెలిపారు.

——

Read more RELATED
Recommended to you

Exit mobile version