అర్ధరాత్రి గౌరవెల్లిలో పర్యటించిన బండి సంజయ్..

-

సిద్దిపేట జిల్లా గుడాటిపల్లిలో పోలీసులు, టీఆర్ఎస్ నాయకుల దాడిలో గాయపడ్డ గౌరవెల్లి బాధితులను పరామర్శించారు బండి సంజయ్. 14 ఏళ్లుగా ఏనాడు ప్రాజెక్టును అడ్డుకోలేదు, ప్రాజెక్టు కోసం తమ భూములను ఇచ్చేసామని, పరిహారం ఇవ్వడం లేదని, 14 ఏళ్లుగా పరిహారం అందించాలని కోర్టు చెప్పిన కూడా ప్రభుత్వం కక్షకట్టినట్టుగా వ్యవహరిస్తోందని నిర్వాసితులు వాపోయారని ఈ సందర్భంగా పేర్కొన్నారు బండి సంజయ్.

పరిహారం కోసం వెళితే అధికారులు, అసభ్య పదజాలంతో వేధిస్తున్నారని, పోలీసులు ఇష్టమొచ్చినట్లుగా విచక్షణారహితంగా తమపై దాడి చేసారని, మేం చేసిన తప్పెందేని వారు వాపోయారు. స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆదేశాలతోనే పోలీసులు, టీఆర్ఎస్ నాయకులు తమపై దాడులు చేస్తూ వేధిస్తున్నారని భూనిర్వాసితులు తమ సమస్యలు చెప్పుకున్నారన్నారు.

సీఎం కేసీఆర్ కు అధికారం తలకెక్కి కాండకావరంతో వ్యవహరిస్తున్నాడు. కమీషన్లకు అలవాటు పడి బలుపెక్కి పోలీసులతో ఇష్టమొచ్చినట్లు కొట్టిస్తున్నాడు. ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేశారు…పరిహారం అడిగితే చావబాదుతారా..? బాధితులేమైనా సీఎం ఫామ్ హౌస్ లో జాగా ఆడిగారా? దేశమంతా కోట్ల రూపాయలతో యాడ్స్ ఇస్తూ పబ్లిసిటీ చేసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ డబ్బుతో ఇక్కడున్న వాళ్ళందరికీ పరిహారం అందించొచ్చు కదా..! నిజాం కాలం నాటి అరాచకాలు కెసిఆర్ పాలనలో కొనసాగుతోంది. కడుపుకాలి బాధితులు ఉంటే బలుపెక్కి కెసిఆర్ రెచ్చగొట్టి, పోలీసులతో కొట్టిస్తున్నాడని అగ్రహించారు.

పంజాబ్ కు పోయి అక్కడోళ్లకు 3 లక్షలు ఇస్తున్నాడు, ఇక్కడి రైతులు చస్తుంటే, పైసా సాయం చేయకుండా పోలీసులతో కొట్టిస్తున్నాడు.బాధితులకు న్యాయం జరిగే వరకు బిజెపి పోరాడుతుంది. పోలీసుల దాడిలో గాయపడ్డ బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నాము. వారిని తీసుకెళ్లి గవర్నర్ కు, మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం. బిజెపి లీగల్ టీమ్ గౌరవెల్లిని సందర్శించి బాధితులతో కలిసి న్యాయ పోరాటం చేస్తుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version