మీరు ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా..? ఆ వ్యాపారం తో అదిరిపోయే పొందాలనుకుంటున్నారా…? అయితే మీకోసం ఒక బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియా ని కనుక మీరు ఫాలో అయితే కచ్చితంగా లక్షల్లో లాభాలు వస్తాయి. పైగా ఎప్పుడు మంచి డిమాండ్ ఉండే బిజినెస్. అదే సమోసాల వ్యాపారం. సమోసాలే కదా అని చీప్ గా చూడకండి. ఈ వ్యాపారంతో కూడా మంచిగా డబ్బులు వస్తున్నాయి. మంచి రుచి, నాణ్యతని మెయింటెన్ చేసే ఆర్డర్ల సంఖ్య పెరుగుతుంది.
మొదట తక్కువ మాత్రమే అమ్ముడైన ఆ తర్వాత మీ వ్యాపారం పెరుగుతుంది. అయితే మంచి రుచిగా సమోసాలు చేయడానికి వంట వాళ్ళని మీరు ఏర్పాటు చేసుకోవాలి. పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రుల్లో, ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు వద్ద అమ్మితే ఎక్కువగా డబ్బులు వస్తాయి. మొదట చిన్న షాప్ మొదలు పెట్టి తర్వాత మీరు వ్యాపారాన్ని క్రమంగా విస్తరించుకోవచ్చు.
మీరు పబ్లిసిటీ కోసం సోషల్ మీడియా ని వాడుకోవచ్చు లేదా జస్ట్ డయల్ వంటి ఆన్లైన్ వెబ్ సైట్లలో కూడా ప్రకటన ఇవ్వచ్చు. ఇలా మీరు సమోసాలు వ్యాపారం చేసి మంచిగా లాభాలనే పొందొచ్చు. సమోసాలు చేయడానికి కావలసిన పదార్థాలు అవసరమవుతాయి.
కూరకి బంగాళదుంపలు మసాలా దినుసులు అలానే నూనె ఇలాంటివి కావాలి. కాబట్టి వీటిని కొనుగోలు చేయడానికి పెట్టుబడి సిద్ధం చేసుకోండి మొదట్లో ప్రారంభించడానికి పది నుండి ఇరవై వేలు కావాలి. ఇలా మీరు క్రమంగా వ్యాపారాన్ని విస్తరించే నెలకు లక్ష రూపాయలు సంపాదించచ్చు.