వైజాగ్ వేదికగా జరిగిన రెండవ టెస్ట్ నాలుగో ఇన్నింగ్స్‌లో 399 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 292 పరుగులకే ఆలౌట్ అయి పరాజయం పాలైంది.గడిచిన రెండు సంవత్సరాలుగా బజ్‌బాల్ ఆటతో స్వదేశంతో పాటు విదేశాల్లోనూ మెరుపులు మెరిపిస్తున్న ఇంగ్లాండ్ టీం…. ఇండియాలో కూడా అదే దూకుడును ప్రదర్శిస్తున్నది. మొదటి టెస్టులో అద్భుత ప్రదర్శనతో నెగ్గిన ఆ జట్టు వైజాగ్‌లో మాత్రం అదే జోరును కొనసాగించలేకపోయింది. ఇక వైజాగ్ టెస్టులో ఇంగ్లాండ్ ఓటమిపై ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు జెఫ్రీ బాయ్‌కాట్ స్పందిస్తూ….. ఇంగ్లీష్ టీమ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బజ్‌బాల్ అనేది ఓ అట్టర్ ప్లాఫ్ అని , ఇదే ఫార్ములా తో గతేడాది స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్‌లో ఓడినా ఆ జట్టు గుణపాఠం నేర్చుకోలేదని బాయ్‌కాట్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
హెడ్‌కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్, కెప్టెన్ బెన్ స్టోక్స్‌లు టెస్టులను జనరంజకం చేస్తున్నామని చెప్పుకుంటున్న కొన్ని మ్యాచ్‌లు ఓడిపోయినా ఫర్వాలేదని అంటున్నారు. బజ్‌బాల్ ఆటతీరు గొప్ప ఎంటర్‌టైనరే కావొచ్చు.కానీ ఓడిపోతే కీర్తి ఎలా వస్తుంది..? అన్ని సందర్బాల్లో అదే ఆట కుదరదు. ఇవాళ ఇంగ్లండ్ ఓటమితో బజ్‌బాల్ ఒక ఫెయిల్యూర్ అని మరోసారి రుజువయింది అని తెలిపారు.