తెలంగాణ ప్రభుత్వం ఈనెల 16న కేబినెట్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుండగా ఇందులో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. అసెంబ్లీలో కమిటీ హాల్లో జరిగే మంత్రివర్గ సమావేశంలో పలు చట్ట సవరణ బిల్లులకు కేబినెట్ ఆమోదం పలుకుతుందని, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణకు కూడా అవకాశం ఉంటుందని పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది.
ఈ కేబినెట్ భేటీలో ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే చాలా మంది సీనియర్లు మంత్రి పదవి కోసం వెయిట్ చేస్తుండగా.. అందుకోసం హైకమాండ్ లెవల్లో లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఈ ఏడాది చివరకు రావడంతో గతంలో ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను అమలు చేసే అంశాలపై సైతం కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది.