గ్లోబల్‌ వార్మింగ్‌పై చాట్‌బాట్‌ రిజల్ట్‌.. ఆందోళనతో వ్యక్తి ఆత్మహత్య!

-

సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ ఆధారిత చాట్‌జీపీటీ, చాట్ బాట్ ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. కానీ వీటి వల్ల ముప్పుందని తెలిసి పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా చాట్ బాట్ చెప్పిన సమాధానాలతో ఓ వ్యక్తి ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఐ కారణంగా జరిగిన తొలి మరణంగా టెక్ నిపుణులు దీన్ని భావిస్తున్నారు.

బెల్జియంకు చెందిన పియర్‌ అనే వ్యక్తి ఛాయ్‌ అనే ఏఐ ఆధారిత యాప్‌లో ఉండే ఎలిజా అనే చాట్‌బాట్‌తో గత రెండేళ్లుగా చాటింగ్‌ చేస్తున్నాడు. పియర్‌.. మహిళ గొంతుతో స్పందించే ఎలిజాను ఎంచుకున్నాడు. ఈ చాట్‌బాట్‌తో రోజులో ఎక్కువ సమయం గడుపుతుండేవాడని పియర్‌ భార్య క్లెయిర్‌ చెప్పినట్లు బెల్జియం వార్తా సంస్థ పేర్కొంది. పియర్‌ తరచూ వాతావరణ మార్పులపై చాట్‌బాట్‌ను ప్రశ్నిస్తుండేవాడని క్లెయిర్‌ తెలిపింది.

ఈ క్రమంలో గ్లోబల్‌ వార్మింగ్‌  గురించి చాట్‌బాట్‌ చెప్పిన సమాధానాలతో ప్లియర్‌ ఆందోళన చెందేవాడని క్లెయిర్‌ పేర్కొంది. పర్యావరణ పరిరక్షణ బాధ్యతలు ఎలిజా చాట్‌బాట్‌ తీసుకుంటే తాను ఆత్మహత్య చేసుకోవాలనే ప్రతిపాదన చాట్‌బాట్‌ ముందుంచాడని క్లెయిర్‌ తెలిపింది. అయితే, ప్లియర్‌ ఆత్మహత్య ఆలోచనలను చాట్‌బాట్ నివారించకపోవడంతో అతను ఆత్మహత్యకు చేసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version