కాంగ్రెస్ కోసం కారు మంత్రి పోరాటం?

-

కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడం దాదాపు ఖాయమైంది…ఇప్పటికే బీజేపీ పెద్దలతో టచ్ లో ఉన్న కోమటిరెడ్డి…ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇదే క్రమంలో మునుగోడులో తన అనుచరులు, కార్యకర్తలతో భేటీ అయ్యి..పదవికి రాజీనామా చేసి వెళితేనే బెటర్ అని చెప్పుకొస్తున్నారు. అంటే కోమటిరెడ్డి బీజేపీలోకి వెళ్ళడం ఖాయం..అదే సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారు కాబట్టి..మునుగోడు స్థానానికి ఉపఎన్నిక జరగనుంది.

ఇక్కడ వరకు అంతా క్లారిటీగానే ఉంది..ఇక కోమటిరెడ్డి పార్టీ మార్పుపై కాంగ్రెస్ నేతలు తమదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తున్నారు..ఇప్పటికే భట్టి విక్రమార్క…కోమటిరెడ్డిని కలిశారు. అయితే కోమటిరెడ్డి పార్టీ మార్పుపై భట్టి సీరియస్ గా వ్యాఖ్యలు చేయలేదు. మిగిలిన నేతలు కూడా పెద్దగా స్పందించడం లేదు. పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయితే..ఇంతవరకు దీనిపై మాట్లాడలేదు. అంటే కోమటిరెడ్డి విషయాన్ని కాంగ్రెస్ లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది.

కానీ టీఆర్ఎస్ పార్టీ మాత్రం…కోమటిరెడ్డి పార్టీ మార్పుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంది. ఇప్పటికే మునుగోడు ఉపఎన్నికని దృష్టిలో పెట్టుకుని మంత్రి జగదీశ్ రెడ్డి…ఆ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. ఇదే క్రమంలో కోమటిరెడ్డిపై ఫైర్ అవుతూ ఉన్నారు. నమ్ముకున్న ప్రజలకు, నీడనిచ్చిన పార్టీకి ద్రోహం చేస్తున్నావని జగదీశ్..కోమటిరెడ్డిని విమర్శిస్తున్నారు. బీజేపీలో ఎందుకు చేరాలనుకుంటున్నావో సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అలాగే టీఆర్ఎస్ లో చేరేందుకు 300 సార్లు కేసీఆర్ కాళ్ళు పట్టుకుని కోమటిరెడ్డి బ్రతిమలాడారని అంటున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ కోసం జగదీశ్ పోరాటం చేస్తున్నట్లు కనిపిస్తోంది. కోమటిరెడ్డి పార్టీ మారుతుంటే కాంగ్రెస్ పార్టీనే పెద్దగా పట్టించుకోవడం లేదు…కానీ జగదీశ్ మాత్రం…నీడనిచ్చిన పార్టీకి ద్రోహం చేస్తున్నావని మాట్లాడటం విడ్డూరంగానే ఉంది. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళుతుంటే…మధ్యలో సంజాయిషీ ఇవ్వాలని టీఆర్ఎస్ మంత్రి మాట్లాడటం వింతగా ఉందని చెప్పొచ్చు. ఇక ఇంతవరకు కోమటిరెడ్డి టీఆర్ఎస్ లోకి వస్తున్నట్లు ప్రచారం రాలేదు…కానీ కేసీఆర్ ని బ్రతిమలాడారని అంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ కోసం కారు పార్టీ ఫైట్ చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news