తెలంగాణలో ఉన్న చీకోటి ప్రవీణ్ క్యాసినో కింగ్ గా మరియు జంతు ప్రేమికుడిగా చాలా ఫేమస్ అని తెలిసిన విషయం తెలిసిందే. ఇక ఈ మధ్యన బ్యాంకాక్ లో జరిగిన మనీ లాండరింగ్ కేసు లోనూ చీకోటి ప్రవీణ్ ను అరెస్ట్ చేసి ఆ తర్వాత వదిలేశారు. కాగా ఇటీవల లాల దర్వాజా అమ్మవారి బోనాల సందర్భంగా గుడికి వెళ్లిన చీకోటి ప్రవీణ్ గన్ మెన్ లు ఎటువంటి అనుమతి తీసుకోకుండా లోపలకు గన్ లతో పాటు రావడంతో వివాదం అయింది. ఈ సంఘటనలో వారిని పోలీసులు పట్టుకుని విచారణ చేయడం జరిగింది. కాగా ఈ గన్ లైసెన్స్ లను చెక్ చేయగా ఎక్సపైర్ అయినట్లు గుర్తించారు. మాములుగా రెన్యూవల్ చేసుకుని గన్ లను వాడాల్సి ఉంది. ఈ విషయం సీరియస్ గా తీసుకున్న పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.