తమ్ముళ్ళు…గుడివాడలో కొడాలితో ఈజీ కాదు..!

-

ఏదేమైనా కొడాలి నాని అంటే తెలుగు తమ్ముళ్ళకు విపరీతమైన కోపం ఉందనే చెప్పాలి. అసలు నాని పేరు చెబితేనే తమ్ముళ్ళు రగిలిపోయే పరిస్తితి ఉంది. ఈ పరిస్తితి ఎందుకు ఉందో కూడా తెలిసిందే…అంతా నాని అన్న దయే. అసలు నాని ఏ స్థాయిలో చంద్రబాబు, లోకేష్‌లని తిడతారో చెప్పాల్సిన పని లేదు. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఇంతవరకు ఏ ప్రత్యర్ధి తిట్టని తిట్లు కొడాలినే తిట్టారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఇంకా నాని బూతులు ఎలా ఉంటాయో మనం విడమర్చి చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

Kodali-Naniఅలా తిడతారు కాబట్టే నాని అంటే తమ్ముళ్ళకు బాగా కోపం…అసలు నానికి ఎలాగోలా చెక్ పెట్టేయాలని తెగ ట్రై చేస్తున్నారు. నాని నోటికి తాళం వేయాలంటే…ఆయన్ని గుడివాడలో ఓడించడమే ఒక్కటే మార్గమని తమ్ముళ్ళకు బాగా అర్ధమైంది. అందుకే టీడీపీ నేతలు గుడివాడనే టార్గెట్ చేశారు. పాపం గతంలో గుడివాడ టీడీపీకి కంచుకోట. నాని కూడా టీడీపీ నుంచే రెండుసార్లు గెలిచారు..కానీ తర్వాత నాని వైసీపీలోకి వెళ్ళి..గుడివాడలో టీడీపీని గట్టి దెబ్బ తీశారు. ఇప్పుడు గుడివాడ గడ్డ..నాని అడ్డా అన్నట్లు మారిపోయింది.

అలాంటప్పుడు గుడివాడలో నానిని దెబ్బకొట్టడం అంత సులువు కాదు. కానీ ఎలాగోలా నానికి చెక్ పెట్టాలని తమ్ముళ్ళు చూస్తున్నారు. నానిని గుడివాడలోనే నెగిటివ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కొడాలి నానికి చెందిన కళ్యాణ మండపంలో జరిగిన క్యాసినో వ్యవహారాన్ని తమ్ముళ్ళు ఆసరాగా తీసుకున్నారు. గుడివాడని గోవాగా మార్చేసి యువతని నాశనం చేస్తున్నారంటూ తమ్ముళ్ళు ఫైర్ అయిపోతున్నారు. అలాగే కొందరు టీడీపీ నేతలు గుడివాడలో ఎంట్రీ ఇచ్చి క్యాసినో వ్యవహారం తెలుస్తామని హడావిడి చేశారు. కానీ వారిని పోలీసులు అడ్డుకున్నారు…అలాగే వారిపై వైసీపీ శ్రేణులు దాడులు చేశాయి.

దీనిపై కూడా సీరియస్‌గానే స్పందించారు…క్యాసినో నిర్వహించనని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, పెట్రోలో పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని మాట్లాడారు. అయితే నాని ఎన్ని మాట్లాడినా గుడివాడలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. అలా అని గుడివాడలో నానిని నెగిటివ్ చేయడం టీడీపీ వల్ల అయ్యే పని కాదు. ఎందుకంటే ఈ క్యాసినో, పేకాటలాంటివి పట్టించుకునే పరిస్తితుల్లో ప్రజలు లేరు. కాబట్టి అవేమీ నానికి డ్యామేజ్ చేయవు. కాబట్టి గుడివాడలో నానికి చెక్ పెట్టడం అంత సులువు కాదు.

Read more RELATED
Recommended to you

Latest news