నేడు రాజ్యసభకు షెడ్యూల్ కులాల రాజ్యాంగ సవరణ బిల్లు

-

ఢిల్లీ : ఇవాళ నాలుగవ రోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే, షెడ్యూల్ కులాల రాజ్యాంగ సవరణ బిల్లు ను రాజ్యసభ లో ప్రవేశపెట్టనున్నారు కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా.

ఇప్పటికే షెడ్యూల్ కులాల రాజ్యాంగ సవరణ బిల్లు…లోక్ సభలో ఆమోదం పొందింది. అటు రాజ్యసభలో ది ఎనర్జీ కన్జర్వేషన్ సవరణ బిల్లు, 2022’ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్. అంతేకాదు.. ఇప్పటికే ది ఎనర్జీ కన్జర్వేషన్ సవరణ బిల్లు 2022 లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ రెండు బిల్లులను రాజ్యసభలో ఆమోదించుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version