వివేకా హత్య కేసులో తెరపైకి కొత్త పేరు..?

-

మాజీ మంత్రి వివేకా హత్య కేసు దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతోంది. తెరపైకి రోజుకో కొత్త పేరు వస్తోంది. తాజాగా ఈ కేసులో నవీన్ అనే వ్యక్తి తెరపైకి రావడంతో అతడిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎంపీ అవినాష్‌రెడ్డి ఫోన్‌ కాల్‌డేటా ఆధారంగా ఈ పేరు వెల్లడైనట్లు సీబీఐ అధికారులు తెలిపారు. నవీన్‌ కుటుంబ సభ్యులు పులివెందులలోని రాజారెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరు సీఎం జగన్‌ తాత రాజారెడ్డి దగ్గర పని చేసేవారు. నవీన్‌ చదువుకుంటూ జగన్‌కు దగ్గరయ్యారు. జగన్‌తోపాటు వెళ్లి బెంగళూరు, హైదరాబాద్‌లో లోటస్‌ పాండ్‌లో ఆయన దగ్గర పని చేశారు.

అనంతరం జగన్‌ కుటుంబం తాడేపల్లికి మకాం మారినప్పుడు ఇక్కడికి చేరుకున్నారు. దాదాపు 15 ఏళ్లుగా వారితోనే ఉంటున్నారు. జగన్‌ సతీమణి భారతికి విధేయుడిగా ఉంటూ ఇంటి పనులన్నీ చేసి పెడుతున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి వివేకా మరణానంతరం నవీన్‌కు అవినాష్‌రెడ్డి పలుమార్లు ఫోన్‌ చేసినట్లు కాల్‌డేటా ఆధారంగా సీబీఐ గుర్తించింది. దాంతో ఆయనపై సీబీఐ దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అతని మొదటి పేరు హరిప్రసాద్‌ కాగా… నవీన్‌గా మార్చుకున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version