టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యం కారణంగా ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇవ్వాళ మృతి చెందారు. దీంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గాయన మృతిపై చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు అలాగే రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా వారి సంతాపాన్ని తెలుపుతున్నారు.
ప్రముఖ సినీ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఆకస్మిక మరణం తెలుగు సినిమా రంగానికి, సాహిత్య రంగానికి తీరని లోటు. ఆయన ఆత్మ కు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. సీతారామ శాస్త్రి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి- రేవంత్ రెడ్డి
తెలుగు పాటని తన సాహిత్యంతో దశదిశల వ్యాపింపజేసిన ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు నాకు ఎంతో ఆప్తులు. నేను నటించిన చిత్రాలకు వారు అద్భుతమైన పాటలు రాయడం జరిగింది. సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని కలిగించిన వ్యక్తి సిరివెన్నెల గారు. ఆయన ఈ రోజు మన మధ్య లేకపోవడం చాలా భాధాకరం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతున్ని కోరుకుంటూ.. వారి కుంటుంభ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను – నందమూరి బాలకృష్ణ
సిరివెన్నెల సీతారామశాస్త్రి లేని లోటు తీర్చలేనిదని, తెలుగు సాహిత్యం, సినిమా రంగానికి ఆయన ఎనలేని సేవచేశారని సినీహీరో సాయిధరమ్‌తేజ్ ట్వీట్
ప్రముఖ తెలుగు సినీగేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం. ఎటువంటి సంగీత ప్రక్రియలతోనైనా పెనవేసుకుపోయే అద్భుత సాహిత్యాన్ని సృష్టించిన సిరివెన్నెల, ఆయన మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి, సంగీత సాహిత్య అభిమానులకు తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు సిఎం తన ప్రగాఢ సానుభూతి.
తెలుగు సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల. అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులు. ఆయన హఠాన్మరణం మొత్తంగా తెలుగువారికి తీరనిలోటు. 1/2
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 30, 2021
'సిరివెన్నెల' మనకిక లేదు. సాహిత్యానికి ఇది చీకటి రోజు pic.twitter.com/dcRFE4XPXn
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 30, 2021
Thank you #SirivennelaSeetharamaSastry Garu for your unparalleled contribution to our industry. You shall forever be remembered and missed. Honoured to have known you and worked with you. Rest in peace sir. 💔#RAPO pic.twitter.com/NbOHj8wc5F
— RAm POthineni (@ramsayz) November 30, 2021
His words, his songs and his magic will live forever.
ఆయన సాహిత్యం లోని సిరివెన్నెల మన మనసుల మీద ఎప్పటికీ అలానే వుంటుంది.
వీడుకోలు గురువు గారూ..🙏🏼💔 pic.twitter.com/YWOxLvsebj— Nani (@NameisNani) November 30, 2021
అద్భుత సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మృతి వార్త దిగ్భ్రాంతిని కలిగించింది. దాదాపు 3000లకు పైగా పాటలు రాసి సంగీత ప్రియులను అలరించిన పద్మశ్రీ సీతారామశాస్త్రి గారి మరణం తెలుగు సాహితీ లోకానికే తీరని లోటు.(1/2) pic.twitter.com/JoN3A5jbeR
— N Chandrababu Naidu (@ncbn) November 30, 2021
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరు అనే వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురిచేసింది. అలుపెరుగక రాసిన ఆయన కలం నేడు ఆగినా, రాసిన అక్షరాలు తెలుగు భాష ఉన్నంత కాలం అందరికీ చిరస్మరణీయంగా నిలిచివుంటాయి.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని మనసారా ప్రార్థిస్తున్నాను. pic.twitter.com/O1fgNJEqau
— Jr NTR (@tarak9999) November 30, 2021
తెలుగు సినిమా గేయరచయిత శ్రీ చేంబోలు సీతారామశాస్త్రి గారు పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. తొలి సినిమా సిరివెన్నెల పేరునే ఇంటి పేరుగా మార్చుకుని తెలుగు భాషకు పట్టం కడుతూ వారు రాసిన విలువలతో కూడిన ప్రతి పాటనూ అభిమానించే వారిలో నేను కూడా ఒకణ్ని. pic.twitter.com/K2fL2IZrFy
— Vice President of India (@VPSecretariat) November 30, 2021
Shocked and saddened to know about the passing of Sirivennela Seetarama Sastry Garu.
His precious words for RRR and Sye Raa are etched in my memory forever.
His contributions to literature and Telugu Cinema is unparalleled. My deepest condolences to his family. 🙏— Ram Charan (@AlwaysRamCharan) November 30, 2021
The words he put together will never be forgotten. RIP To one of the greatest ever. Your legacy will keep you alive forever sir. Sirivennela Seetharama Sastry garu will be missed. 🙏🏻🙏🏻🙏🏻
— Akhil Akkineni (@AkhilAkkineni8) November 30, 2021