ఇప్పుడు తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోందనే చెప్పాలి. పక్కా ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తోంది. ఇకపోతే ఇప్పుడు వస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక ముగిసేలోపే బలపడేందుకు బాగానే ప్లాన్ వేస్తోంది. ఆలోగా ప్రజా సంగ్రామయాత్రతో పాటు సభలు నిర్వహించిన తర్వాత ఉప ఎన్నిక వస్తే అందులో ఎలాగూ గెలుస్తాము కాబట్టి మంచి సపోర్టు దొరకుతుందని భావిస్తున్నారు కమలనాథులు. ఇందుకోసం పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారు. ఇక బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రకు ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు ఎందినటువంటి బీజేపీ నేతలు కూడా వస్తున్నారు.
కేవలం తెలంగాణ వాళ్లు మాత్రమే వస్తే ఇది జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోదని కేంద్ర నాయకత్వం రంగంలోకి దిగి ఇతర రాష్ట్రాల్లోని బీజేపీలో కీలకమైన నేతలకు బండి సంజయ్‌కు మద్దతుగా దించుతున్నారు. ఇక వారు పాదయాత్రలకు వస్తూనే సంజయ్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. బండి సంజయ్ చేస్తున్న పాదయాత్రతో మార్పు వస్తుందని చెబుతున్నారు. ఇంకోవైపు సీఎం కేసీఆర్ పై విమర్శలు చేస్తూ దీన్ని జాతీయ టాపిక్‌గా చేస్తున్నారు. దీంతో జాతీయ మీడియా కూడా దీన్ని బాగానే కవర్ చేస్తోంది.
తెలంగాణలో ప్రస్తుతం నడుస్తోంది కేసీఆర్ కుటుంబ పాలన అని, ఈ గడీల పాలనను అంతమొందిస్తామంటూ ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలు చెప్పడం బాగా కలిసివచ్చే అంశం. ఎందుకంటే కేవలం తెలంగాణకు చెందిన వారు మాత్రమే విమర్శలు చేస్తే అది పెద్ద టాపిక్ కాదు గానీ వేరే రాష్ట్రాలకు చెందిన వారు చేస్తే మాత్రం అది కచ్చితంగా పెద్ద టాపిక్ అవుతుంది. ఇప్పటికే మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వస్తే, ఇక నిన్న చత్తీస్ ఘడ్ మాజీ సీఎం రమణ్ సింగ్, అలాగే కర్ణాటక బీజేపీ ఎంపీ అయినటువంటి శోభాకరంద్లాజే పాదయాత్రకు కలిసి వచ్చారు.