అప్ఘానిస్తాన్ పరిణామాలపై ప్రతిపక్షాలతో కేంద్ర సమావేశం

-

అప్ఘానిస్తాన్ పరిణామాల పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అప్ఘానిస్తాన్ పరిణామా ల పై అఖిలపక్ష భేటీ కి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు అన్నీ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్ల కు పరిణామాల గురించి వివరించాలని ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ను ఆదేశించారు ప్రధాని నరేంద్ర మోడీ.

అయితే ఈ సమావేశ తేదీ ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించనున్నారు. ఈ సమావేశం రేపు ఉండే అవకశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అప్ఘానిస్తాన్ దేశం లో పరిణామాలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. అప్ఘానిస్తాన్ దేశం లో ఉన్న మన భారతీయులను వెంటనే.. వెనక్కి తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యం లోనే అఖిలపక్ష భేటీ నిర్వహించి.. ప్రతి పక్షాల నిర్ణయాలను తీసు కోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచన చేస్తున్నారు. కాగా వారం కిందట అప్ఘానిస్తాన్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version