ఏపీలో వైసీపీ మరియు టీడీపీ నాయకుల మధ్యన మాటల వార్ నడుస్తోంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం జగన్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న ఎన్నికల్లో వైసీపీని ప్రజలు ఓడిస్తేనే రాష్ట్రము గెలిచినట్లని వ్యాఖ్యానించాడు. ఇప్పటి వరకు సీఎం జగన్ చేసిన పాలన నచ్చక సొంత పార్టీలో నేతలే పక్క పార్టీలకు క్యూ కడుతున్నారు అంటూ కౌంటర్ వేశాడు. సీఎం జగన్ రాక్షసులు అందరినీ మించిపోయాడని… బకాసురుడు కన్నా మించిన రాక్షసుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్ అని ఘాటు వ్యాఖ్యలు చేసాడు చంద్రబాబు. ఒకప్పుడు విశాఖపట్టణం ప్రశాంతంగా ఉండేది.. కానీ ఇప్పుడు వెళ్ళనతేనే భయపడేలా తయారు చేశాడు ఈ సైకో సీఎం అంటూ మండిపడ్డారు.
సీఎం జగన్ రాక్షసులందరినీ మించిన రాక్షసుడు: చంద్రబాబు
-