అల్లు అర్జున్ ను పొగిడిన మాజీ సీఎం చంద్రబాబు

-

తెలుగు సినిమా పరిశ్రమలో జాతీయ అవార్డును దక్కించుకున్న మొదటి నటుడిగా అల్లు అర్జున్ ఘనతను సాధించాడు. 2021 లో విడుదలైన పుష్ప మూవీ లో అల్లు అర్జున్ నటనకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నాడు. దీనితో ఇతని పేరు మరోసారి ప్రపంచం అంతా కూడా మారుమ్రోగిపోయింది.. కాగా నిన్నటి నుండి అల్లు అర్జున్ ను అందరూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అల్లు అర్జున్ కు ఈ అవార్డు రావడం పట్ల చాలా సంతోషంగా ఉందని తెలిపారు. 58 సంవత్సరాల సుదీర్ఘ సినిమా పరిశ్రమ చరిత్రలో అల్లు అర్జున్ కు ఈ అవార్డు రావడం చాలా గర్వమంటూ చంద్రబాబు తెలిపారు. ఇక రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ మూవీకి కూడా చాలా అవార్డులు వచ్చాయంటూ కితాబిచ్చారు.

రానున్న కాలంలో తెలుగు సినిమా పరిశ్రమకు మరిన్ని పురస్కారాలు రావాలని కోరుకుంటున్నానని చంద్రబాబు తెలియచేయడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version