నిన్న ఎన్టీఆర్‌, నేడు ఎస్పీబీ.. తెలుగుజాతికే అవమానకరం : చంద్రబాబు

-

గుంటూరులో ఏర్పాటు చేసిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని అధికారులు తొలగించడం తెలిసిందే. అయితే, అత్యంత దారుణ రీతిలో ఎస్పీ బాలు విగ్రహం నేడు ఓ మరుగుదొడ్డి వద్ద దర్శనమిచ్చింది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. కరడుగట్టిన దోపిడీ దొంగలకు దోచుకోవడం తప్ప కళల గురించి, కళాకారుల గురించి ఏం తెలుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. “గాడిదకేం తెలుసు గంధపుచెక్క వాసన అని ఓ సామెత ఉంది. అందుకే నిన్న ఎన్టీఆర్ వంటి మహానుభావుడ్ని అవమానించారు, ఇవాళ గాన గంధర్వుడిని అవమానించారు. ఎస్పీ బాలు మన తెలుగువాడు అని చెప్పుకోవడమే మనకు గర్వకారణం. అటువంటిది, ఎస్పీ   బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని అనుమతి లేదంటూ తొలగించడం, ఇంకా ఘోరంగా, తొలగించిన ఆ విగ్రహాన్ని మరుగుదొడ్డి వద్ద పెట్టడం తెలుగుజాతికే అవమానకరం” అని మండిపడ్డారు చంద్రబాబు.

ఎస్పీ బాలు విగ్రహం పరిస్థితి తెలిసి మనసు చివుక్కుమందని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు. ఎస్పీ బాలును అవమానించినందుకు ప్రభుత్వం వెంటనే తెలుగు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. అంతేకాదు, ఎస్పీ బాలు విగ్రహం గుంటూరులో ఓ మరుగుదొడ్డి వద్ద ఉన్న ఫొటోను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు చంద్రబాబు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version