మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీల నిర్మాణంపై జోనల్ ఇన్‌ఛార్జ్‌లతో బుధవారం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. క్లస్టర్ ఇన్‌ఛార్జ్ నియామకాలు కాని 30 నియోజకవర్గాలపై దృష్టి సారించి, వారం రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో క్లస్టర్, యూనిట్ నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించారు చంద్రబాబు. అదేవిధంగా బూత్ కమిటీల నియామకం ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలన్నారు చంద్రబాబు. ఆగస్టు మొదటి వారం నుంచి 15వ తేదీలోపు సెక్షన్ల నియామకం పూర్తి చేయాల్సిందేనని, ఇందుకోసం జోనల్ ఇన్‌ఛార్జ్‌లు సంబంధిత జోనల్ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని.. నిర్దేశిత సమయంలోపు కమిటీల నిర్మాణం పూర్తి చేయాలన్నారు చంద్రబాబు.
జగన్ రెడ్డి గ్యాంగ్ కొండల్ని చెరువులుగా చేసేసిందని చంద్రబాబు ధ్వజమెత్తారు చంద్రబాబు. కొండల్ని ఏ విధంగా పెంచుతారంటూ న్యాయస్థానం సైతం ప్రశ్నించిందని గుర్తు చేశారు చంద్రబాబు. చారిత్రాత్మక విశాఖ రుషికొండను కనుమరుగు చేయటం బరితెగింపేనని మండిపడ్డారు చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా అడవుల నరికివేతపై 75 ఘటనలు తన దృష్టికి వచ్చాయని, పద్ధతి ప్రకారం ఇసుక తవ్వకాలు చేపట్టకుండా వాతావరణ సమస్యలకు తెరలేపారని దుయ్యబట్టారు చంద్రబాబు. వ్యక్తులు ముఖ్యం కాదు.. సమాజమే శాశ్వతమని వెల్లడించారు. పర్యావరణాన్ని కాపాడకుండా అడవుల్ని నాశనం చేస్తే భవిష్యత్తు తరాలకు తీవ్ర ముప్పేనని హెచ్చరించారు చంద్రబాబు.