ఒక్క ఛాన్స్ నినాదంతో వచ్చిన జగన్ రెడ్డికి అదే చివరి ఛాన్స్ అవుతుంది : చంద్రబాబు

-

నియోజకవర్గ ఇంచార్జ్‌లతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖాముఖీ నిర్వహించారు. నేటితో 126 నియోజకవర్గాల ఇంచార్జ్‌లతో సమీక్షలు ముగిశాయి. పులివెందుల, వెంకటగిరి, నూజివీడు, తుని, పాడేరు, పాలకొండ నియోజకవర్గాల ఇంచార్జ్ లతో నేడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్ పాలనా తీరు, విద్వేష రాజకీయాల కారణంగా తనను ఎన్నుకున్న పులివెందులకూ జగన్ చెడ్డపేరు తెచ్చారన్నారు. ఒక్క చాన్స్ నినాదంతో వచ్చిన జగన్ రెడ్డికి అదే చివరి చాన్స్ అవుతుంది. రివర్స్ పాలనతో సొంత నియోజకవర్గ ప్రజల నుంచి కూడా వ్యతిరేకత తెచ్చుకున్నారు.

వివేకా హత్యపై సమాధానం చెప్పలేక, విద్వేష రాజకీయాల కారణంగా ముఖ్యమంత్రి నైతికంగా పతనం అయ్యాడు. బాబాయ్ హత్య కేసులో స్వయంగా ముఖ్యమంత్రి దోషులను కాపాడడం పులివెందుల ప్రజలకు కూడా మింగుడు పడడంలేదు. రివ్యూల అనంతరం నేతల పనితీరులో మార్పు వచ్చిందా లేదా అనే అంశంపైనా సమాచారం. తెప్పించుకుంటున్నా. ప్రజా సమస్యలపై పోరాటం, పార్టీ కార్యక్రమాల నిర్వహణలో నేతల వేగం పెరగాలని చంద్రబాబు అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version