బాబు వర్సెస్ పెద్దిరెడ్డి..తెగని పంచాయితీ.!

-

ఏదో పొలం గట్టు తగాదా మాదిరిగా చిత్తూరు జిల్లాలో చంద్రబాబు, పెద్దిరెడ్డిల మధ్య పంచాయితీ ఎప్పటినుంచో జరుగుతూనే వస్తుంది. ఇద్దరిది ఒకే జిల్లా..ఇక వీరికి చదువుకునే సమయం దగ్గర నుంచి పడని పరిస్తితి. రాజకీయాల్లోకి వచ్చాక ఎవరూ తగ్గట్లేదు. ఓ వైపు టీడీపీ అధినేతగా ఉన్న చంద్రబాబు..తన సొంత జిల్లాలో సత్తా చాటాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. అటు వైసీపీలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..ఎలాగైనా బాబుకు చెక్ పెట్టి చిత్తూరులో టీడీపీని నిలువరించాలని చూస్తూనే ఉన్నారు.

అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక పెద్దిరెడ్డి మంత్రి అవ్వడం..ఇక చిత్తూరుపై ఓ స్థాయిలో ఫోకస్ పెట్టి టీడీపీని దీబ్బకొట్టాలని చూస్తున్నారు. అసలు చంద్రబాబు కంచుకోట కుప్పంని ఎలా టార్గెట్ చేశారో చెప్పాల్సిన పని లేదు. ఈ సారి కుప్పంలో సైతం గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నారు. దీనికి కౌంటరుగా బాబు కూడా తగ్గట్లేదు..ఎలాగైనా చిత్తూరులో పెద్దిరెడ్డిని నిలువరించాలని, ఈ సారి పుంగనూరులో టీడీపీ జెండా ఎగరవేయాలని చూస్తున్నారు. ఇలా వీరి మధ్య వార్ నడుస్తుంది.

కాకపోతే పెద్దిరెడ్డి అధికారంలో ఉండటంతో..ఆయన హవా నడుస్తోంది. పైగా పోలీసులు వారి చేతుల్లోనే ఉంటున్నారు..ఈ క్రమంలో ఏం జరిగినా టీడీపీ నేతలు అరెస్టులు జరుగుతున్నాయి. ఇటీవల కుప్పంలో బాబు పర్యటన సందర్భంగా ఉద్రిక్తత పరిస్తితులు నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో కొంతమంది టీడీపీ శ్రేణులని పోలీసులు అరెస్ట్ చేశారు.

తాజాగా సంక్రాంతి సందర్భంగా తన సొంత వూరు నారావారిపల్లె వచ్చిన బాబు…పీలేరు జైలులో ఉన్న తమ కార్యకర్తలని, నేతలని పరామర్శించడానికి ప్రయత్నిస్తే..పోలీసులు అడుగడుగున అడ్డుకునే ప్రయత్నాలు చేశారు..అలాగే బాబుకు వ్యతిరేకంగా పెద్దిరెడ్డి అనుచరులు ఫ్లెక్సీలు కట్టారు. అయితే ఎలాగోలా జైలు వద్దకు వెళ్ళి తమ నాయకులని బాబు పరామర్శించారు. ఇదే సమయంలో పెద్దిరెడ్డిని ఎట్టి పరిస్తితుల్లోనూ వదిలి పెట్టేది లేదని, పండుగ పూట కూడా తమ కార్యకర్తలని జైల్లో ఉంచారని, తాము అధికారంలోకి రాగానే ఎక్కడ ఉన్నా పెద్దిరెడ్డిని వదలమని వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికి ఇలా బాబు-పెద్దిరెడ్డి పంచాయితీ నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version