వైసీపీ నేతలకు వార్నింగ్ ఇస్తున్నా… ఖబడ్దార్, జాగ్రత్తగా ఉండండి : చంద్రబాబు

-

కర్నూలు జిల్లాలోని కోడుమూరులో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోకు జనం భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కాకినాడ జిల్లాలో ఒక ఎమ్మెల్సీ ఎగిరెగిరిపడ్డాడు… కారు డ్రైవర్ ను చంపి, ఇంటికి పంపించి అంత్యక్రియలు చేసుకోమన్నాడు. ఆ ఎమ్మెల్సీ ఇప్పుడు జైల్లో ఉన్నాడు, పోలీసులు ప్రయత్నించారు కానీ అతడికి బెయిల్ కూడా రాలేదు. జగన్ మోహన్ రెడ్డి ఏమీ చేయలేడు. అటు బాబాయ్ ను చంపారు… ఈ కేసు వేరే రాష్ట్రానికి మార్చారు. ఎగిరెగిరిపడేవారికి వార్నింగ్ ఇస్తున్నా, వైసీపీ నేతలకు వార్నింగ్ ఇస్తున్నా… ఖబడ్దార్, జాగ్రత్తగా ఉండండి… రౌడీలను పరిగెత్తించిన పార్టీ టీడీపీ… ముఠాలను రూపుమాపిన పార్టీ టీడీపీ… మతవిద్వేషాలు కట్టడి చేసిన పార్టీ, తీవ్రవాద సమస్యలు పరిష్కారం చేసిన పార్టీ టీడీపీ… నేను తలుచుకుంటే ఈ రౌడీ రాజకీయాలు అణచలేనా తమ్ముళ్లూ! దయాదాక్షిణ్యాలు లేకుండా అణచివేస్తా. వడ్డీతో సహా వడ్డిస్తాం” అని చంద్రబాబు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.

“ఎవడో పనికిమాలిన వాడు మా కార్యకర్తను కొట్టాడంట… వాడికి చెబుతున్నా… నిన్ను కాదు, నిన్ను పంపించిన వాడ్ని కూడా లాక్కొస్తా. డోన్ లో ఒక పనికిమాలిన అప్పుల మంత్రి ఉన్నాడు. నా కార్యకర్త ఇంటి గోడను కూల్చివేశారు. నీ ఇల్లును కూల్చాలంటే నాకు ఒక్క నిమిషం పని. నీ ఇల్లే కాదు… నీ జీవితం కూడా కూలిపోతుంది. న్యాయం ప్రకారం నడుచుకోండి. లేకపోతే మీ గుండెల్లో నిద్రపోతా. పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ద్రోహులైన పోలీసుల కథ నేను తేలుస్తా… మంచి పోలీసులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ నేను సభ నిర్వహించకపోయినా ఇంతమంది వచ్చారంటే, సభ ఏర్పాటు చేసుంటే కోడుమూరు పట్టేది కాదు. రాష్ట్రంలో ఇప్పుడు టీడీపీ గాలి వీస్తోంది… ఈ గాల్లో వైసీపీ కొట్టుకుపోతుంది” అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version