నెక్స్ట్ ఎన్నికల్లో సత్తా చాటాలనే లక్ష్యంగా పవన్ కల్యాణ్ పావులు కదుపుతున్నారు…ఇప్పటివరకు పార్టీ పెద్దగా విజయాలు సాధించలేకపోయింది..2014లో ఎలాగో పోటీ చేయకుండా పవన్…టీడీపీకి సపోర్ట్ ఇచ్చారు…ఇక 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. కేవలం జనసేనకు ఒక సీటు మాత్రమే వచ్చింది. అలా జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యే సైతం వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు.
దీంతో ఏపీ అసెంబ్లీలో జనసేనకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది…అయితే ఈ సారి ఎన్నికల్లో మాత్రం ఎలాగైనా గెలవాలనే కసితో జనసేన శ్రేణులు పనిచేస్తున్నాయి..కాకపోతే వైసీపీ-టీడీపీలతో పాటు జనసేన విజయాలు సాధించడం చాలా కష్టం…ఆ విషయం స్పష్టంగా తెలుస్తోంది…కానీ కొన్ని సీట్లలో మాత్రం జనసేనకు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో….గత ఎన్నికల్లో ఎలాగో తూర్పులో రాజోలు సీటుని జనసేన గెలుచుకున్న విషయం తెలిసిందే.
అయితే ఈ సారి ఆ రెండు జిల్లాల్లో సీట్లు ఎక్కువ గెలవాలని జనసేన ట్రై చేస్తుంది. ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరిలో ఉన్న నరసాపురం అసెంబ్లీ సీటుపై జనసేన ఫోకస్ చేసింది…ఈ సీటుని ఎలాగైనా గెలవాలని చూస్తుంది. గత ఎన్నికల్లోనే ఇక్కడ వైసీపీకి జనసేన గట్టి పోటీ ఇచ్చి…కేవలం ఆరు వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది..ఇక్కడ టీడీపీ మూడో ప్లేస్‌కు పరిమితమైంది. ఇప్పటికీ అక్కడ టీడీపీది మూడో ప్లేస్ మాత్రమే.
ఈ సారి కూడా ఇక్కడ వైసీపీ-జనసేనల మధ్య పోరు నడవనుంది…ఈ పోరులో పై చేయి సాధించాలని జనసేన చూస్తుంది. జనసేన ఇంచార్జ్ బొమ్మిడి నాయకర్ గట్టిగానే కష్టపడుతున్నారు. తాజాగా పవన్ సైతం నరసాపురంలోనే మత్స్యకారుల అభ్యున్నతి సభ పెట్టారు. ఇక్కడ ఉన్న కాపులు, మత్యకారుల మద్ధతు జనసేనకు వస్తే గెలవడం సులువు. అలాగే నెక్స్ట్ టీడీపీతో పొత్తు ఉంటే ఈ సీటులో జనసేన ఈజీగా గెలిచేస్తుంది. మొత్తానికి నరసాపురంలో జనసేనదే పైచేయి అని చెప్పొచ్చు.