ఆర్మీ హెలికాప్టర్‌ లో నెల్లూరుకు గౌతమ్‌ రెడ్డి భౌతికకాయం తరలింపు

-

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి.. ఇవాళ మృతి చెందిన సంగతి తెలిసిందే. గుండె పోటు రావడంతో.. మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి.. మరణించారు. దీంతో వైసీపీ పార్టీ లో విషాదం చోటు చేసుకుంది. అయితే..ఇవాళ ఉదయం 10గం.లకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన భౌతికఖాయాన్ని నెల్లురుకు తరలించనున్నారు. మంత్రి మేకపాటి పార్థివ దేహం వెంట ప్రభుత్వం ఏర్పాటు చేసిన చాపర్ లో తల్లి మణిమంజరి, సతీమణి శ్రీకీర్తి కూడా వెళ్ళనున్నారు.

ఇక ఉదయం 11.15గం.లకు శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పోలీస్ గ్రౌండ్ కి ఆర్మీ చాపర్ చేరుకోనుంది. 11.25 గం.లకు డైకాస్ రోడ్డులోని శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా క్యాంపు కార్యాలయానికి మంత్రి మేకపాటి పార్థివదేహం చేరనుంది. 11.30 శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆత్మకూరు ప్రజల సందర్శనార్థం మంత్రి క్యాంపు కార్యాలయంలో పార్థివదేహాన్ని ఉంచనున్నారు.

ఇప్పటికే యూ.ఎస్ నుంచి బయలుదేరిన మంత్రి మేకపాటి కుమారుడు కృష్ణార్జున రెడ్డి రాత్రి 11గం.లకు శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా క్యాంపు కార్యాలయానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. బుధవారం ప్రభుత్వ లాంఛనాలతో సీఎం మంత్రి మేకపాటి భౌతిక దేహానికి అంతిమ సంస్కారాలు జరుగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news