టాలీవుడ్‌ లో పెద్దరికం నాకు వద్దు – చిరంజీవి

-

మెగాస్టార్‌ చిరంజీవి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. చిత్రపురి కాలనీ నూతన గృహా సముదాయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని.. అనిల్ , దొరై ఎంతో కష్టపడి గృహా సముదాయాన్ని పూర్తి చేశారని చిరు పేర్కొన్నారు. సినీ కార్మికులకు సొంత ఇల్లు ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను.. ఎం. ప్రభాకర్ రెడ్డి దూరదృష్టి వల్లే కార్మికుల కల సాకారమైందని తెలిపారు.

దేశంలో ఎక్కడాలేని విధంగా తెలుగు సినీ కార్మికులకు గృహాసముదాయం ఉందని.. చిత్రపురి కాలనీలో అవకతవకల గురించి నేను మాట్లాడనని తెలిపారు. ఎంతో నీతి నిజాయతీతో వల్లభనేని అనిల్ కమిటీ గృహా సముదాయాన్ని పూర్తి చేసిందని..నేను పెద్ద కాదు, వాళ్లు చిన్నవాళ్లుగా చెప్పుకుంటూ నన్ను పెద్ద చేస్తున్నారని పేర్కొన్నారు. కార్మికులకు అవసరం వచ్చినప్పుడు తప్పకుండా భుజం కాస్తానని హామీ ఇచ్చారు చిరంజీవి.

Read more RELATED
Recommended to you

Exit mobile version