క్యాన్సర్ తో పోరాడుతున్న అభిమానికి అండగా మెగాస్టార్..!

-

క్యాన్సర్ తో పోరాడుతున్న తన అభిమానికి అండగా ఉండేందుకు మెగాస్టార్ ముందుకు వచ్చారు. పూర్తిగా వైద్య ఖర్చులు తానే భరిస్తానని మెగాస్టార్ అభిమాని కుటుంబానికి హామీ ఇచ్చారు. విశాఖ జిల్లాకు చెందిన వెంకట్ అనే మెగాస్టార్ అభిమాని గత కొంత కాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్నారు. ఈ విషయాన్ని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు మెగాస్టార్ దృష్టికి తీసుకు వచ్చారు. దాంతో మెగాస్టార్ వెంకట్ ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకురావాలని చెప్పారు. అంతే కాకుండా పూర్తిగా వైద్య ఖర్చులు తానే భరిస్తానని మెగాస్టార్ హామీ ఇచ్చారు. దాంతో వెంకట్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే గతంలో కూడా మెగాస్టార్ తన అభిమానులు కష్టాల్లో ఉన్న సందర్భాల్లో ఆదుకున్నారు. ముఖ్యంగా తన అభిమానులు వైద్యం కోసం ఇబ్బందులు పడుతుంటే అనేక సార్లు ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. ఇదిలా ఉంటే చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ఓకే పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవాలయాలకు సంబంధించిన కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. అంతేకాకుండా సినిమాలో మెగాస్టార్ కు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన పాటలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version