రాజకీయాలకు చిరంజీవి అన్ ఫిట్ అని పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి అంటే పెద్ద పెద్ద బిల్డింగ్ లు కాదు.. ప్రజల అభివృద్దే రాష్ట్ర అభివృద్ధి అన్నారు. చంద్రబాబు పాలనలో పేదలు జీవచ్ఛవంలా ఉండిపోయారు. జగన్ సంక్షేమ పాలనలో పేదలు అభివృద్ధిలోకి వచ్చారు. అర్బన్ ప్రాంతాల్లో ఉండే ధనవంతులకు గ్రామాల్లో ఉండే పేదల కష్టాలు ఎలా తెలుస్తాయి..? ఆ పేదల కష్టాలు చూసి సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేశారు. చంద్రబాబు అండ్ కో కి పేదలు అభివృద్ధి చెందడం ఇష్టం లేదు.
చంద్రబాబు అధికారంలో ఉంటే రెవెన్యూ లోటు ఉంటుంది. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఏమీ సంపద సృష్టించాడు..? అర్బన్ ఓటర్లు చంద్రబాబు ఏమీ చేశాడో.. జగన్ ఏమీ చేశాడో ఆలోచించాలి.. అర్బన్ ఓటర్లు గ్రామాల్లోని పేద కుటుంబాల్లో జరిగిన అభివృద్ధి గమనించాలి. చిరంజీవికి ప్రజలు అంటే లెక్క లేదు. ప్రజా సేవ అని పార్టీ పెట్టీ మూసేసాడు. చిరంజీవికి ప్రజలపై ప్రేమ లేదు.. సినిమా లానే రాజకీయాల్ని బిజినెస్ లా చూశాడు. 18 మంది ఎంఎల్ఏ లను కాంగ్రెస్ కి అమ్మేశాడు. రాజకీయాలు వద్దని సినిమాలోకి వెళ్ళాడు.. ఇప్పుడు మళ్ళీ రాజకీయ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ప్రజలకి వెన్నుపోటు పొడిచిన చిరంజీవికి ఓటు వేయమని అడిగే అర్హత లేదు. చిరంజీవిని నమ్మి చాలా మంది కాపులు జీవితాలు నాశనం చేసుకున్నారని తెలిపారు.