ఇ– క్రాప్‌ వందశాతం పూర్తి చేయాలి : సీఎం జగన్‌

వ్యవసాయం పై సీఎం జగన్‌ నేడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎరువులు అందించడంలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలన్నారు. ఎక్కడ నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని, ఆర్బీకేల్లో ఉన్న అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ నుంచి ప్రతి రోజూ నిరంతరం సమాచారం తెప్పించుకోవాలన్నారు సీఎం జగన్‌. విత్తనాల సరఫరా, ఎరువుల పంపిణీ, వ్యవసాయ ఉత్పత్తులకు అందుతున్న ధరలు తదితర అంశాలపై నిరంతరం అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ ద్వారా తెప్పించుకోవాలని, ఇ– క్రాప్‌ వందశాతం పూర్తి చేయాలన్నారు సీఎం జగన్‌.

CM YS Jagan Mohan Reddy to visit Kurnool today

వైయస్సార్‌ ఉచిత పంటల బీమా పథకంతో భాగస్వామ్యం కానున్న ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన, రైతులకు గరిష్ట లబ్ధి చేకూర్చేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం పై సమావేశంలో చర్చించారు సీఎం జగన్‌. మాస్టర్‌ ట్రైనర్లను తయారు చేయాలన్నారు సీఎం జగన్‌. డ్రోన్ల నిర్వహణ, మరమ్మతుపై శిక్షణ ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాలని, నియోజకవర్గానికి ఒక ఐటీఐ లేదా ఒక పాలిటెక్నిక్‌ కళాశాలలోని విద్యార్థులకు డ్రోన్ల వినియోగం, నిర్వహణ, మరమ్మతులపై సంపూర్ణ శిక్షణ ఇప్పించాలన్నారు సీఎం జగన్‌.