చంద్రబాబు దార్శినికుడు కాబట్టే మా ప్రధాని వచ్చినప్పుడు రాళ్లేశారు : సోము వీర్రాజు

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సెటైర్లు వేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ రాజధాని కోసం ఉద్యమించడానికి హక్కున్న ఏకైక పార్టీ బీజేపీ అని అన్నారు సోము వీర్రాజు. నన్ను రాజధాని విషయంలో ఎవరో ప్రశ్నించారని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారని, ట్రోల్ చేసిన వాళ్లు ఒక పార్టీ వాళ్లైతే.. ఆ ప్రశ్నించిన వ్యక్తి టీడీపీ వ్యక్తి అంటూ సమాధానం చెప్పింది మరో పార్టీ అన్నారు సోము వీర్రాజు. చంద్రబాబును మేమొప్పుడు అగౌరవపర్చలేదని, చంద్రబాబు బ్రహ్మండమైవ దార్శినికుడు కాబట్టే రాజధాని కోసం రూ. 8500 కోట్లు ఇచ్చామని, చంద్రబాబు దార్శినికుడు కాబట్టే మా ప్రధాని వచ్చినప్పుడు రాళ్లేశారన్నారు సోము వీర్రాజు. ఎన్డీఏ కన్వీనరుగా చంద్రబాబు ఉన్నప్పుడు ఆయన్ను కలవాలని ప్రధాని మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు వస్తే కలవకుండా కారెక్కి వెళ్లిపోయారు. అయినా చంద్రబాబు గౌరవనీయులు కాబట్టి 2014లో పొత్తు పెట్టుకున్నాం.

Tension erupts in Jonada as police stops Somu Veerraju from going to  Amalapuram

2018లో మాతో విబేధించారు. చంద్రబాబు గౌరవనీయులు కాబట్టే పోలవరానికి నిధులిచ్చాం. చంద్రబాబు రాజధాని ఎందుకు కట్టలేకపోయారు..? జగన్ కూడా రాజధానిని, పోలవరాన్ని పట్టించుకోవడం లేదు. పోలవరం గురించి కమ్యూనిస్టులు పాదయాత్ర చేస్తారా..? కమ్యూనిస్టులా..? క్యాపిటలిస్టులా..? ఎవరు ప్యాకెట్ ఇస్తే వాళ్ల వైపే కమ్యూనిస్టులు వెళ్లిపోతారు. పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వివరాలను కేంద్రానికి ఇచ్చారా..? నాడు చంద్రబాబు కానీ.. ఇప్పుడు జగన్ కానీ ఆర్ అండ్ ఆర్ వివరాలు ఎందుకివ్వరు..?మైనింగ్ అక్రమాలు ఏం చేద్దాం..? బీచ్ శాండ్ తవ్వకాల ఎలా జరుపుదాం.. ఇదే జగన్ ప్రభుత్వ ఆలోచన. కృష్ణా జిల్లాలోనే కేంద్రంలో ఉన్న బీజేపీ ఎంతో చేస్తోంది.. జగన్ ప్రభుత్వం ఏమైనా చేస్తోందా..?అని ప్రశ్నించారు సోము వీర్రాజు.