అంగన్ వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. ఇప్పటివరకు ప్రభుత్వ పథకాలకు దూరంగా అంగన్ వాడీలకు గుడ్ న్యూస్ చెప్పారు. అర్హులైన అంగన్ వాడీ, మినీ అంగన్ వాడీ కార్యకర్తలు, అంగన్ వాడీ హెల్పర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని జిల్లా కలెక్టర్లకు, సంబంధిత శాఖలకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఆదాయ పరిమితిలోపు గౌరవ వేతనం పొందుతున్న అంగన్ వాడీ, మినీ అంగన్ వాడీ వర్కర్లు, అంగన్ వాడీ హెల్పర్లకు వైఎస్సార్ పెన్షన్ కానుకతో పాటు జగనన్న అమ్మ ఒడి, ఇళ్ల స్థలాల పట్టాలు, ఇళ్ల నిర్మాణాలకు సాయంతో పాటు వివిధ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని.. ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ, వాలంటీర్ల శాఖతో పాటు గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధిశాఖలు, జిల్లా కలెక్టర్లకు జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సంబంధిత శాఖలకు సర్క్యూలర్ ఇచ్చింది.