సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డికి ప్రభుత్వంలో అదనపు సేవలను అప్పగిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అనుబంధ విభాగాల సమన్వయ బాధ్యతలతో పాటు అదనంగా మరిన్ని బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్.
రీజినల్ కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు సమన్వయ బాధ్యతలను అప్పగించారు. ఎమ్మెల్యే, మీడియా కోఆర్డినేషన్ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేటాయించారు. ఈనెల 19వ తేదీన జారీ చేసిన ఉత్తర్వులను మార్చుతూ సీఎం కొత్త ఆదేశాలను జారీ చేశారు.
గతంలో విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర పార్టీ సమన్వయకర్తగా విజయసాయిరెడ్డి బాధ్యతలు చూశారు. అయితే ఇటీవల కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తరువాత ఆ బాధ్యతల నుంచి విజయసాయిరెడ్డిని తప్పించారు. విశాఖ బాధ్యతలను వై.వి.సుబ్బారెడ్డి అప్పగించారు.