దేశానికి కొత్త రాజ్యాగం కావాలని సంచలాత్మకమైన ప్రకటన చేసారు సీఎం కెసిఆర్. సీఎం హోదాలోనే దేశం కోసం పోరాడతానని…గుజరాత్ సీఎం గా ఉండి మోడీ ప్రధాని అయ్యారని పేర్కొన్నారు. నేను ఎంపీగానా ? ఎమ్మెల్యే గా పోటీ చేయాలా ? అన్నది తేల్చుకో దానికి ఇంకా రెండు ఏళ్ళు ఉందన్నారు సీఎం కెసిఆర్. ప్రధాని ఐదు న హైదరాబాద్ వస్తే స్వాగతం పలుకుతానని…ప్రోటోకాల్ పాటిస్తా … ప్రధానికి ఇవే విషయాలు చెప్తా అని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.
త్వరలో హైదరాబాద్లో రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సదస్సు నిర్వహిమని..దేశంలోని పరిస్థితుల పై చర్చిస్తామన్నారు సీఎం కెసిఆర్. అందరూ కలిసి వస్తారు…ప్రజల వెంట అందరూ వెళ్ళాలన్నారు. మేధో మథనం తరువాత పోరాట కార్యక్రమమని…బీజేపీ పాలనపై చర్చకు నేను రెడీ
మోడీ టోపీలు, పంచలు మార్చితే అభివృద్ధి అంటామా ? అని ప్రశ్నించారు సీఎం కెసిఆర్. ఒకరి రెండు రోజుల్లో ముంబై వెళ్లి సీఎం నీ కలుస్తానని…బయటి రాష్ట్రాల్లో MIM గెలిస్తే మంచిదేఅసద్ తెలంగాణ వ్యక్తే కదా .? అన్నారు. ప్రధానికి చెప్పినా గోడకు చెప్పినా ఒకటేనని..దేశ ఆర్థిక పరిమితి పెంచే అవగాహన బీజేపీ -కాంగ్రెస్ కు లేవు ఆని పేర్కొన్నారు.