Breaking : టీఆర్‌ఎస్ అభ్యర్థికి బీ ఫాం అందజేసిన సీఎం కేసీఆర్‌

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు జాతీయ రాజకీయాల్లో సైతం మునుగు ఉప ఎన్నికకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఉప ఎన్నికలపై బీజేపీ, టీఆర్‌ఎస్‌, బీజేపీ భవిష్యత్‌ నిర్ణయాలు ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు. అయితే.. తాజాగా.. మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి శుక్రవారం సీఎం కేసీఆర్ పార్టీ బీ ఫాం అందజేశారు. ఉప ఎన్నికల ప్రచారం, తదితర ఖర్చుల కోసం పార్టీ నిధుల నుంచి అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి సీఎం కేసీఆర్ రూ.40 లక్షల చెక్కును అందజేశారు.

మునుగోడు అభ్యర్థిగా ఎంపికైన అనంతరం సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసేందుకు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి శుక్రవారం ప్రగతి భవన్ కు వచ్చారు. ఈ సందర్భంగా తనను ఎంపిక చేసినందుకు సీఎం కేసీఆర్ కు ఆయన కృతజ్జతలు తెలిపారు. తనపై నమ్మకంతో నాలుగోసారి కేసీఆర్ బీఫామ్ ఇచ్చారని, మునుగోడులో టీఆర్ఎస్ పార్టీదే గెలుపు అని కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వెంట మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, గువ్వల బాలరాజు, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస రెడ్డి ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version