జులై 1 నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి : సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు

-

జులై 1 నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.  జులై 1 నుంచి ప్రారంభించనున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల తర్వాత, నిర్దేశించిన ఏ పనీ పెండింగులో ఉండటానికి వీల్లేదన్నారు. పంచాయతీరాజ్ శాఖకు ప్రభుత్వం ఇంతగా సహకరిస్తున్నా కూడా పనులు ఇంకా ఎందుకు పెండింగులో ఉంటున్నాయో.. అధికారులు పున: సమీక్ష చేసుకోవాలని…గ్రామాల్లో ప్రతి ఇంటికీ ఆరు మొక్కల చొప్పున డోర్ టు డోర్ పంపిణీ చేసి, నాటించాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా పంటలు పండుతూ దేశ ధాన్యాగారంగా మారిందని.. రాష్ట్రానికి అదనపు రైస్ మిల్లులు తక్షణ అవసరమని తెలిపారు సీఎం కేసీఆర్‌. అలాగే రైస్ మిల్లుల సంఖ్యను పెంచాలని..తెలిపారు.

రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టి.. ఫుడ్ ప్రాసెసింగ్ ఎస్.ఇ.జెడ్ (సెజ్) లను 250 ఎకరాలకు తక్కువ కాకుండా ఏర్పాటు చేయాలని…సెజ్ ల చుట్టూ బఫర్ జోన్లు ఏర్పాటు చేసి, ఆ పరిధిలో లే ఔట్లకు, నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని ఆదేశించారు. కల్తీ విత్తనాల అమ్మకాల పట్ల కఠినంగా వ్యవహరించాలని… వ్యవసాయశాఖ, పోలీసు శాఖ అధికారులు సమన్వయంతో కల్తీ విత్తనాల అమ్మకాలను అరికట్టాలని తెలిపారు. ఈ విషయంపై కలెక్టర్లు, జిల్లాల ఉన్నతాధికారులు విశేష అధికారాలను వినియోగించాలన్నారు. గ్రామాల్లో విద్యుత్ సమస్యలను అధిగమించడానికి పవర్ డే ను పాటించాలని.. ప్రజలను చైతన్య పరిచి, శ్రమదానంలో పాల్గొనేలా చేసి, కరెంటు సమస్యలను పరిష్కరించుకోవాలని సీఎం కెసిఆర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version