భద్రాచలంలో గోదారమ్మకు శాంతి పూజలు చేసిన సీఎం కేసీఆర్

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలం చేరుకున్నారు. ఉదృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది కి సీఎం కేసీఆర్ శాంతి పూజ నిర్వహించారు. వంతెనపై నుంచి గోదావరి పరిసరాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. అక్కడినుంచి మరికాసేపట్లో గోదావరి వరద తాకిడికి గురైన కరకట్టను పరిశీలించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ… భద్రాచలం ముంపు బాధితులకు శాశ్వత కాలనీలు నిర్మిస్తామని ప్రకటన చేశారు.

గతంలో కంటే.. కనివినీ ఎరుగని వరదలు వస్తున్నాయని.. 50 అడుగులు గోదావరి వచ్చిన కొన్ని ప్రాంతాలు మునుగుతున్నాయని పేర్కొన్నారు సీఎం కేసీఆర్. కాబట్టి ముంపు బాధితులకు కోసం.. ఎత్తైన ప్రాంతాలను చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీని కోసం ప్రత్యేకంగా హైదరాబాద్‌ నుంచి అధికారులు వస్తారని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. భద్రాచలం లో ఎలాంటి ప్రాణ హాని జరుగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version