తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారత స్వతంత్ర వజోత్సవాల పేరిట ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల ఆశలు నెరవేరడటం లేదు. అడుగు వర్గాల ప్రజల్లో ఆక్రోశం ఇంకా వినిపిస్తుంది. అనేక వర్గాల ప్రజలు తమకు స్వతంత్ర ఫలాలు సంపూర్ణంగా అందట్లేదని ఆవేదన మనకు కనబడుతుందని కేసీఆర్ తెలిపారు. వాటన్నింటిని విస్మరించి దేశాన్ని ఉన్మాద స్థితిలోకి నెట్టివేసేందుకు కుటిల ప్రయత్నాలు జరగడాన్ని మనమంతా చూస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. మౌనం వహించడం సరికాదు. అర్థమైన తర్వాత కూడా అర్థం కానట్టు ప్రవర్తించడం మేధావుల లక్షణం కాదు. ధీరోదాత్తులు, మేధావులు, వైతాళికులు కరదీపికలుగా మారి ఏ సమాజాన్ని అయితే సక్రమమైన మార్గంలో నడిపిస్తారో ఆ సమాజం గొప్పగా పురోగమించే అవకాశం ఉంటదన్నారు సీఎం కేసీఆర్.
అద్భుతమైన ప్రకృతి సంపదతో, ఖనిజ సంపదతో యుశక్తితో, మానవసంపత్తితో ఉన్న ఈ దేశం పురోగమించడం లేదని, స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో ఉజ్వలమైన రీతిలో ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనందరిపై ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ క్రమంలోనే ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమం నిర్వహించుకున్నాం. గ్రామాల్లో, పట్టణాల్లో స్వతంత్ర ఉద్యమంపై చర్చ జరిగిందని పేర్కొన్నారు సీఎం కేసీఆర్. సామూహిక జాతీయ గీతాలాపన చేయాలంటే సుమారు కోటి మంది పాల్గొన్నారు. ఏకకాలంలో ఆలపించడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం అని పేర్కొన్నారు సీఎం కేసీఆర్. మహాత్ముడు విశ్వమానవుడు. కొందరు అల్పులు నీచంగా మాట్లాడుతున్నారు. ఆయన గొప్పతనాన్ని యూఎన్‌వో ప్రశంసించింది. అంతర్జాతీయంగా ఏ దేశానికి వెళ్లిన ఇండియా అంటే యూ ఆర్ గ్రేట్ అని పొగడ్తల వర్షం కురిపిస్తుంటూరు. గాంధీ గారి జీవిత విశేషాలు, విగ్రహాలు.. విదేశాల్లో ఉన్నాయంటే భారతదేశానికి గర్వకారణం అని చెప్పారు సీఎం కేసీఆర్.