పంజాబ్‌ లో ఆప్‌ దే అధికారం..ఇదో విప్లవమంటూ కేజ్రీవాల్‌ ట్వీట్

-

పంజాబ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్‌ ఆద్మీ ప్రభంజనం సృష్టిస్తోంది. మొత్తం పంజాబ్‌ లో 117 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అయితే.. ఇందులో.. 91 సీట్లల్లో ఆమ్‌ ఆద్మీ లీడింగ్‌ లో ఉంది. అంటే… పంజాబ్‌ లో ఆప్‌ పార్టీ విజయం దాదాపు ఖరారు అయినట్లే కనిపిస్తోంది. ఇక అధికారిక ప్రకటన రావడమే తరువాయి.

అటు పంజాబ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో.. కాంగ్రెస్‌ పార్టీకి తీవ్ర పరాభవం ఎదురైంది. 117 సీట్లల్లో కాంగ్రెస్‌ పార్టీ కేవలం 17 సీట్లకు పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది. అటు బీజేపీ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది.

కాగా.. పంజాబ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఢిల్లీ సీఎం, ఆప్‌ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ స్వయంగా తన సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ఈ విప్లవానికి పంజాబ్ ప్రజలకు అభినందనలు.. అంటూ ట్వీట్ చేశారు ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. అటు యూపీలో యోగి సర్కార్‌ మరోసారి.. అక్కడి ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version