దివంగత రాజకీయనేత, దేశంలోనే తొలి దళిత సీఎం స్వర్గీయ దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. శుక్రవారం ఆయన నివాసంలో సంజీవయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘన నివాళ్లు అర్పించారు.
నిజాయితీకి నిలువెత్తు రూపం,దళిత జాతి ఆత్మగౌరవానికి ప్రతిరూపమని సీఎం రేవంత్ కొనియాడారు.స్వాతంత్య్ర సమరయోధుడు, దేశంలో తొలి దళిత సీఎం.. పరిపాలనలో మేటి, వృద్ధులు, వికలాంగుల సంక్షేమ పెన్షన్‌లకు ఆద్యుడు అని ఓ సందేశంలో పేర్కొన్నారు.ఈ మేరకు తెలంగాణ సీఎంవో అధికారిక ఖాతా ‘ఎక్స్’ వేదికగా ప్రకటించింది. సంజీవయ్య చిత్రపటానికి నివాళులు అర్పించిన వారిలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్‌లు పటేల్ రమేశ్ రెడ్డి, మానాల మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.