మైండ్ బ్లాక్ అయ్యే వార్త ఇది..రంగులు మారే పూలను చూసి ఉంటారు..కానీ రంగులు మారే డ్రెస్ గురించి ఎప్పుడూ విని ఉండరు. టెక్నాలజీ రోజుకో విధంగా మారుతుంది.మనిషి కళ్ళను కూడా మోసం చేస్తున్నాయి.అలాంటి వాటి గురించి జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.ఇక దుస్తుల విషయాని కొస్తే ట్రెండింగ్ పేరుతో రోజుకో ఫ్యాషన్ మార్కెట్లో ప్రత్యక్షమవుతోంది. డిజైన్ల విషయం అటుంచింతే.. వాటిని తయారు చేసే వస్త్రాలు డిఫరెంట్ గా వస్తున్నాయి. ఇటీవల వాటర్ ప్రూఫ్ షర్ట్స్ మార్కెట్లోకి వచ్చి మంచి ఆదరణ పొందాయి. ఈ కోవలోనే తాజాగా ఓ మహిళ ధరించిన వెరైటీ డ్రెస్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కొత్త కొత్త మోడల్ డ్రెస్సులతో అమ్మాయిలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నారు.తాజాగా ఓ మహిళ ధరించిన వెరైటీ డ్రెస్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ ఇజి వైట్ బాడీకాన్ డ్రెస్ ధరించిన వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. సస్టెయినబుల్ క్లోతింగ్ బ్రాండ్ పీహెచ్5 నుంచి ఈ డ్రెస్‌ను తయారుచేసినట్టు క్యాప్షన్ వెల్లడించింది.
ఈ బ్రాండ్ యూవీ-రియాక్టివ్ డ్రెస్‌ల తయారీలో గుర్తింపు పొందింది. ఈ వైట్ డ్రెస్ సూర్యరశ్మి తగలగానే పింక్‌లోకి మారుతుండటం ఆసక్తి కలిగిస్తోంది. వీడియోలో మహిళ తెల్లటి దుస్తులు ధరించి, ఈ దుస్తులు కూడా రంగు మారుతుందని ప్రజలకు చెబుతోంది. గదిలో ఆమె దుస్తులు తెలుపు రంగులో ఉంటాయి, కానీ ఆమె ఎండలో బయటకు వెళ్లినప్పుడు, ఆమె దుస్తుల రంగు మారి గులాబీ రంగులోకి మారుతుంది. ఆమెను చూడగానే కొన్ని క్షణాల క్రితం తెల్లగా ఉన్నట్టు అనిపించక మానదు. ఆమె మళ్ళీ నీడలోకి వచ్చేసరికి, డ్రెస్ తెల్లగా మారుతుంది..ఆ డ్రెస్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది..మీరు కూడా ఆ డ్రెస్ ను ఒకసారి చూడండి..