నాతో రియ‌ల్ మ్యాచ్‌కు రా.. అక్ష‌య్ కుమార్‌కు అండ‌ర్ టేక‌ర్ స‌వాల్‌.. అక్ష‌య్ రిప్లై అదుర్స్‌..!

-

WWE ప్ర‌పంచంలో అండ‌ర్ టేక‌ర్‌కు ఉన్న ఆద‌ర‌ణ గురించి అంద‌రికీ తెలిసిందే. భార‌త్‌లో అండ‌ర్ టేక‌ర్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. 1990ల‌లో అండ‌ర్ టేక‌ర్ WWE ప్ర‌పంచంలో అడుగు పెట్టాడు. మూడు ద‌శాబ్దాలుగా అందులో కొన‌సాగుతున్నాడు. అండ‌ర్ టేక‌ర్ WWE లో ఫైటింగ్‌కు వ‌స్తున్నాడంటే అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తారు. అయితే అత‌ను బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్‌కు స‌వాల్ చేస్తే ఎలా ఉంటుంది ? ఆస‌క్తిగా ఉంటుంది క‌దా. అవును, స‌రిగ్గా అదే జ‌రిగింది.

బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ న‌టించిన ఖిలాడియో కా ఖిలాడీ మూవీ ఇటీవ‌ల 25 ఏళ్ల‌ను పూర్తి చేసుకుంది. దీంతో అప్ప‌టి విష‌యాల‌ను గుర్తు చేసుకుంటూ అక్ష‌య్ ట్వీట్ చేశాడు. మూవీ ఎండింగ్‌లో అండ‌ర్ టేక‌ర్‌ను ఓడించే సీన్ ఉంటుంద‌ని తెలిపాడు. కానీ మూవీలో న‌టించింది రియ‌ల్ అండ‌ర్ టేక‌ర్ కాదు, మ‌రో WWE స్టార్ మార్క్ కాలావే. అవే వివ‌రాల‌ను అక్ష‌య్ ట్వీట్ చేశాడు.

అయితే త‌న‌తో రియ‌ల్ WWE మ్యాచ్ కు సిద్ధం కావాల‌ని అండ‌ర్ టేక‌ర్ ట్వీట్ చేశాడు. దీనికి అక్ష‌య్ వెంట‌నే స్పందించాడు. తాను ఇన్సూరెన్స్‌ను చెక్ చేసుకుని అప్పుడు మ్యాచ్ కు వ‌స్తాన‌ని స‌ర‌దాగా రిప్లై ఇచ్చాడు. కాగా WWE ఇండియా ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్‌లో షేర్ చేసింది. వారి ట్వీట్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. కాగా అక్ష‌య్ కుమార్ ఫిట్‌నెస్ ప‌రంగా ఎక్కువ శ్ర‌ద్ధ క‌నబ‌రుస్తాడ‌నే సంగ‌తి తెలిసిందే. ప‌లు యాక్ష‌న్ మూవీల్లోనూ అక్ష‌య్ ఎప్ప‌టిక‌ప్పుడు న‌టించి అల‌రిస్తుంటాడు. ఇక త్వ‌ర‌లో అక్ష‌య్ న‌టించిన ప‌లు మూవీలు విడుద‌ల‌కు సిద్ధం కానున్నాయి. అక్ష‌య్ న‌టించిన బెల్ బాట‌మ్ జూలై 27వ తేదీన థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version