BIG BREAKING : ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారుడిగా నటుడు అలీ

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా అలీని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రెండేళ్ల పాటు పదవిలో ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా… నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న అలీ…. రాజకీయాలకు కూడా అప్పుడప్పుడూ కాస్త దగ్గరగానే ఉంటూ వస్తున్నారు. 2019 ఎన్నికల ముందు అనూహ్యంగా వైసీపీలో చేరి అందరినీ ఆశ్చర్య పరిచారు . అప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నా సీట్ల సర్దుబాటులో అది కుదరలేదు. దీంతో వైసీపీ తరఫున ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ముస్లింల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అలీ చేత ప్రచారం చేయించింది వైసీపీ. దీంతో పార్టీ అధికారంలోకి వస్తే అలీకి మంచి పదవి ఖాయం అంటూ ప్రచారం జరిగింది కూడా.

Ali to enter active politics

కానీ, అది జరగలేదు. దాంతో అలీ చాలా డిజప్పాయింట్ గా ఉంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారే అవకాసం ఉందని వార్తలు వచ్చాయి. అలీ గతంలో తెలుగుదేశం పార్టీలో చాలా యాక్టీవ్‌గా ఉండేవారు. కానీ ఇప్పుడు మళ్లీ అటు సొంతగూట్లోకి వెళ్లే ఉద్దేశ్యం లేదట. పవన్ కళ్యాణ్‌తో ఆయనకు ఉన్న స్నేహం కారణంగా జనసేనలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే వైసీపీలో అలీ చేరిన తర్వాత ఆయనకు సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే సినిమా ఇండస్ట్రీ కాస్త దూరం పెట్టిందని కూడా ప్రచారం జరుగుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news