కామన్వెల్త్ గేమ్స్: ఇంగ్లాండ్ మహిళా జట్టు కెప్టెన్‌కు గాయం

-

ఇంగ్లాండ్ మహిళా జట్టు కెప్టెన్ హీథర్ నైట్‌కు గాయమైంది. దీంతో ఆమె కామన్వెల్త్ గేమ్స్‌ లో మహిళల క్రికెట్ సెమీ ఫైనల్ మ్యాచ్‌కు దూరం కానున్నారు. హీథర్ నైట్‌కు గాయాలవడంతో భారత మహిళా జట్టుకు ఊరటనిచ్చే అంశం ఏర్పడింది. కామన్వెల్త్ గేమ్స్ క్రికెట్ సెమీస్‌లో ఇంగ్లాండ్‌తోనే భారత్ శనివారం మ్యాచ్ ఆడనుంది. గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్‌ కు హీథర్ దూరం కానున్నారు.

హీథర్ నైట్‌
హీథర్ నైట్‌

గాయం తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో వైద్య బృందం విశ్రాంతి అవసరమని తెలిపింది. ఆమె స్థానంలో నటాలీ స్కివెర్ సారథ్యం వహించనున్నారు. ఇంగ్లాండ్‌ను విజయవంతంగా నడిపించే హీథర్ లేకపోవడం కీలకమైన సెమీస్ పోరులో ఆ జట్టుకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. కామన్వెల్త్ గేమ్స్ లో నటాలీ స్కివెర్ ఇంగ్లాండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. 14 మంది స్కాడ్ తోనే ఇంగ్లాండ్ మిగతా మ్యాచ్‌లను కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news