కేసీఆర్‌కు అదిరిపోయే షాక్.. కాంగ్రెస్‌తోనే కమ్యూనిస్టులు…!

-

అనుకున్నదొక్కటి…అయినదొక్కటి..ఇదేదో పాట కాదు…తెలంగాణ సీఎం కేసీఆర్ పరిస్తితి..తెలంగాణలో ఓ వైపు ప్రతిపక్షాల తాకిడి కేసీఆర్‌కు బాగా ఎక్కువైంది. టీఆర్ఎస్‌కు ధీటుగా ప్రతిపక్షాలు పికప్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఎలాగైనా రాజకీయంగా ఇబ్బందులు పడకూడదని చెప్పి కేసీఆర్…తనదైన శైలిలో రాజకీయం చేయడం మొదలుపెట్టారు. ఈ మధ్య ఆయన జాతీయ రాజకీయాల్లో మళ్ళీ వేలు పెట్టడం మొదలుపెట్టారు. ఏదో థర్డ్ ఫ్రంట్ కోసమన్నట్లు హల్చల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇటీవల వరుసపెట్టి జాతీయ నేతలతో సమావేశమవుతున్నారు.

kcr
kcr

స్టాలిన్, శరద్ పవార్‌లాంటి నేతలతో పాటు ఇటీవల కమ్యూనిస్టులు, ఆర్జేడీ యువ నేత తేజస్వి యాదవ్…ఇలా వరుసపెట్టి పలువురు నేతలతో భేటీ అవుతూ వస్తున్నారు. ఈ మధ్య కమ్యూనిస్టు నేతలతో సమావేశమైన విషయం తెలిసిందే. ఇంకేముంది కేసీఆర్‌తో కమ్యూనిస్టులు కలిసిపోయారని ప్రచారం తీసుకొచ్చారు. తీరా చూస్తే మిగిలిన నేతల మాదిరిగానే కమ్యూనిస్టులు కూడా కాంగ్రెస్‌తోనే ఉంటామని చెప్పేశారు. స్టాలిన్, తేజస్విలు సైతం..కాంగ్రెస్‌తోనే కలిసి వెళ్తామని చెప్పిన విషయం తెలిసిందే.

ఇప్పుడు కమ్యూనిస్టులు కేసీఆర్‌కు రివర్స్ షాక్ ఇచ్చారు. అసలు కేసీఆర్ వ్యూహమే బీజేపీ వ్యతిరేక ఓట్లు చీల్చడమే అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. అలాగే తేజస్వి యాదవ్ కేసీఆర్‌ను కలిసినప్పుడు కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తామని చెప్పినట్టు తెలిసిందని, బీజేపీ వ్యతిరేక పార్టీలు ఏకం కావాలని.. అది కాంగ్రెస్‌తోనే సాధ్యమని స్పష్టం చేశారు. అసలు కేసీఆర్ పరోక్షంగా బీజేపీకి సాయం చేస్తున్నారనే అనుమానం కలుగుతుందని అన్నారు.

ఇక తమ్మినేని స్టేట్‌మెంట్‌తో కమ్యూనిస్టులు..కాంగ్రెస్‌తోనే కలిసి ముందుకెళ్తాయని, కేసీఆర్‌తో కలవరని అర్ధమైపోతుంది. అలాగే థర్డ్ ఫ్రంట్ అంటూ హడావిడి చేయడం అనేది డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమని అర్ధమవుతుంది. ఏదేమైనా కేసీఆర్ నాయకత్వంపై జాతీయ నేతలకు పెద్దగా నమ్మకం ఉన్నట్లు కనిపించడం లేదు. మొత్తానికైతే కేసీఆర్‌కు కమ్యూనిస్టులు కూడా గట్టి షాక్ ఇచ్చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news